త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నా అంటూ కొద్ది రోజుల క్రితం చెప్పిన మంచు మనోజ్.. ఎట్టకేలకు శుభవార్త చెప్పేశారు. అందరూ అనుకున్నట్లు తన పెళ్లి గురించి కాకుండా.. కొత్త సినిమా గురించి తెలిపారు. వెండితెరకు దూరమై చాలా ఏళ్లు అయినా తాను మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. తన కొత్త ప్రాజెక్ట్ టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
ఎట్టకేలకు గుడ్న్యూస్ చెప్పేసిన మంచు మనోజ్.. త్వరలోనే.. - మంచు మనోజ్ కొత్త సినిమా ప్రకటన
నటుడు మంచు మనోజ్ ఎట్టకేలకు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశారు. ఏంటంటే?
'నేను సినిమా చేసి చాలా ఏళ్లు అవుతోంది. అయినప్పటికీ మీరు నాపై ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు. మీరు చూపిస్తున్న ప్రేమకు తిరిగివ్వాల్సిన సమయం వచ్చేసింది. వాట్ ద ఫిష్ అనే కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతున్నా. ఈ మూవీ మీ అందరికీ కచ్చితంగా క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది' అని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇది చూసిన మంచు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కంగ్రాంట్స్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 'మొత్తానికి రీఎంట్రీ ఇస్తున్నావు, అది చాలు భయ్యా', 'పోస్టర్ అదిరింది', 'మరి అహం బ్రహ్మాస్మి సంగతేంటి?' అంటూ కామెంట్లు పెడుతున్నారు.