మంచు వారి రెండో తనయుడు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. భూమా మౌనికను వివాహం చేసుకోబోతున్నట్లు అంటున్నారు. ఈ జంట కూడా పలు సార్లు బయట కలిసి కనిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం మంచు మనోజ్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. "లైఫ్‌లో నెక్ట్స్ ఫేజ్‌లోకి అడుగుపెట్టబోతున్నా. చాలా రోజులుగా నా మనసులో దాచుకుంటూ వస్తోన్న ఓ స్పెషల్ న్యూస్‌ను జనవరి 20న అందరితో పంచుకోనున్నా" అని ట్విట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్ తను ఏ ఉద్దేశంతో పెట్టారో తెలీదు గానీ.. నెటిజన్లు మాత్రం పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
మంచు మనోజ్ పెళ్లి ఫిక్స్ అయినట్టేనా.. వైరల్‌గా మారిన ట్వీట్ - మంచు మనోజ్ రెండో పెళ్లి
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ చేశారు. ఆ వివరాలు..
manchu manoj
కొంతమంది ఆయన రెండో పెళ్లిని ఉద్దేశించే ట్వీట్ చేసినట్లు చెబుతున్నారు. జనవరి 20న పెళ్లి న్యూస్‌ను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. మనోజ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. మరి కొందరేమో ఆయన సినిమా రీఎంట్రీ గురించి అయ్యుంటుందని భావిస్తున్నారు. మొత్తానికి మనోజ్ చేసిన ఈ ట్వీట్‌పై ఆయన స్పందిస్తేనే అసలు విషయం బయటపడుతుంది. కాగా 'అహం బ్రహ్మాస్మి' పేరుతో ఓ సినిమాను గతంలో మనోజ్ అనౌన్స్ చేశారు. కానీ అది మధ్యలోనే నిలిచిపోయింది.