మోహన్‌బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన.. తన నటన, అభినయంతో ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ను తెచ్చుకున్నారు. భిన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే గత కొంత కాలంగా ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సోషల్‌మీడియాలోనూ కనపడట్లేదు. ఆ మధ్యలో అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. కానీ దాని గురించి ఎటువంటి అప్డేట్స్ రాలేదు. అయితే ఆయన పూర్తిగా వ్యాపార రంగంపై దృష్టిపెట్టారని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారని ప్రచారం సాగింది. దీంతో ఆయన తిరిగి మళ్లీ సినిమాల్లోకి రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మంచు అభిమానులు ఆనందపడే వార్త ఒకటి ప్రచారం జరుగుతోంది.
ఆసక్తి రేపుతున్న మంచు మనోజ్ లేటెస్ట్ పిక్.. సినిమా కోసమేనా? - మంచు మనోజ్ రెండో పెళ్లి
వెండితెరకు దూరమైన మంచు మనోజ్ లేటెస్ట్ పిక్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్ ఏదైనా సినిమా కోసమేనా అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
అదేంటంటే.. ఆయన సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. తాజాగా ఆయన ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. బ్లాక్ అండ్ వైట్‌లో మంచు మనోజ్ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే అది సినిమాలో లుక్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరీ దీనిపై మనోజ్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ మధ్య భూమా మౌనికా రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని వినాయకుని మండపానికి వచ్చారు. వీరిద్దరు కలిసి పూజాలు జరిపించడంతో పెళ్ళి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే వాటిపై ఎవరూ స్పందించలేదు.
ఇదీ చూడండి:కేజీయఫ్ విలన్‌తో హీరోయిన్ నిశ్చితార్థం ఫొటోస్ చూశారా