విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు. కొద్దిరోజుల క్రితమే రెండో వివాహం చేసుకున్న మనోజ్.. తాజాగా తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి మొదటిసారి తిరుపతి జిల్లా రంగంపేటలోని తమ కుటుంబానికి చెందిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను సందర్శించారు. అక్కడ ఈ జంటకు ఊహించని రీతిలో ఘన స్వాగతం పలికారు విద్యార్థులు.
కాగా, మనోజ్ ఇటీవలే మాజీమంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు. అయితే ఆదివారం(మార్చి 19)మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా తమ విద్యా సంస్థైన శ్రీ విద్యానికేతన్‌లో మోహన్‌బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది శ్రీ విద్యానికేతన్ యాజమాన్యం. ఈ వేడుకలకు మనోజ్ దంపతులు స్పెషల్‌గా హాజరయ్యారు. పెళ్లి అయ్యాక తొలిసారి జంటగా వెళ్లిన వీరికి వేల సంఖ్యలో విద్యార్థులు వరుసలో నిలబడి చప్పట్లతో ఆహ్వానం పలికారు. అనంతరం కొత్త జంటతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. అయితే ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఓ వీడియోను మంచు మనోజ్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ అన్నా నీ నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
డాడీ బర్త్‌డేకి విష్ణు ఫ్యామిలీ డుమ్మా..
మార్చి19 ఆదివారం మంచు మోహన్‌బాబు తన 71వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బర్త్‌డే సెలబ్రెషన్స్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు కుటుంబ సభ్యులు. వీటికి సంబంధించిన ఫొటోలను మోహన్‌బాబు కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ వేడుకల్లో మోహన్‌బాబు కొత్త కోడలు మౌనిక రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. మామయ్య పుట్టినరోజును తనే దగ్గరుండి జరిపించినట్లుగా కనిపించారు మౌనికా రెడ్డి. అంతకుముందు పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయితే మంచు లక్ష్మీ పోస్ట్ చేసిన ఫొటోల్లో మోహన్ బాబు భార్య నిర్మలాదేవి, కుమార్తె లక్ష్మి మంచు, మనవరాలు, కుమారుడు మనోజ్, కోడలు మౌనిక ఉన్నారు. కానీ, ఈ సెలబ్రేషన్స్‌లో మాత్రం మంచు విష్ణు కుటుంబం ఎక్కడా కనిపించలేదు. అయితే ఇది గమనించిన ఫ్యాన్స్ మంచు విష్ణు అన్న ఫ్యామిలీ ఎక్కడా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇకపోతే బర్త్‌డేను పురస్కరించుకుని కుటుంబ సభ్యులంతా మోహన్‌బాబుకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలిపారు. మరోపక్క తండ్రి పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ ఓ భావోద్వేగమైన పోస్ట్‌ను షేర్ చేసిన విషయం తెలిసిందే. 'నాన్న కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా.. లవ్ యూ..! అంటూ తండ్రికి విషెస్ చెప్పారు.