తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్​ - మంచు మనోజ్​ న్యూస్

Manchu Manoj Marriage : ప్రముఖ నటుడు మంచు మనోజ్​ తన రెండో పెళ్లిపై స్పందించాడు. నగరంలోని ఓ వినాయక మండపాన్ని దర్శించుకున్న ఆయన.. తన పెళ్లిపై వస్తున్న వందతులపై క్లారిటీ ఇచ్చాడు.

manchu manoj new marriage
manchu manoj new marriage

By

Published : Sep 4, 2022, 10:06 PM IST

Manchu Manoj Marriage : తన రెండో పెళ్లిపై మంచు మనోజ్‌ స్పందించారు. నగరంలోని ఓ వినాయక మండపాన్ని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో 'మీరూ మౌనిక పెళ్లి చేసుకోబోతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు?' అని ఒకరు అడగ్గా అది వ్యక్తిగత విషయమని, సందర్భం వస్తే తప్పకుండా చెబుతానని మనోజ్‌ తెలిపారు. సినిమా అప్‌డేట్స్‌, రాజకీయంలోకి వచ్చే అవకాశాల గురించి ప్రశ్నించగా 'ప్రస్తుతం వినాయకుడి గురించి మాట్లాడుకుందాం' అని అన్నారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రణతీ రెడ్డితో 2015లో మనోజ్‌ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ 2019లో వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఆనాటి నుంచి మనోజ్‌ రెండో పెళ్లి చేసుకోనున్నారంటూ ఎన్నో సార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన 'అహం బ్రహ్మాస్మి' అనే చిత్రంలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో మనోజ్‌ విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details