కలెక్షన్ కింగ్, మంచు మోహన్ బాబు ఇంట పెళ్లి సందడి షురూ అయిపోయింది. ఆయన రెండో కుమారుడు, హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి అంతా సిద్ధమైపోయింది. స్వయంగా మంచు మనోజ్ తన అభిమానులకు ఈ శుభవార్త చెప్పారు. ఆయన మార్చి 3న భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నారని కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా అతి తక్కువ మంది సమక్షంలోనే ఈ వివాహం జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాహ కార్యక్రమానికి కొద్ది మందే ఆహ్వానించారట. అయితే ఇప్పుడు తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మనోజ్. సోషల్‌మీడియా వేదిక భూమా మౌనిక రెడ్డి ఫొటోను పోస్ట్ చేశారు. పెళ్లి కూతురు అని వ్యాఖ్య రాసుకొచ్చారు. #MWedsM #ManojWedsMounika అనే క్యాప్షన్‌ను కూడా జోడించారు. అయితే ముహూర్తం ఎప్పుడనేది చెప్పలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం నేడు(మార్చి 3) రాత్రి ఎనిమిది గంటల ముప్ఫై నిమిషాలకు అని తెలిసింది.
సంగీత్ ఫొటోస్ షేర్.. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్‌లోని మోహన్ బాబు ఇంటిలో పెళ్లికి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. గురువారం సంగీత్ వేడుక ఘనంగా జరిగినట్లు తెలిసింది. సోషల్‌మీడియాలో మంచు లక్ష్మీ పోస్ట్ చేసిన ఫొటోలు మెహందీకి సంబంధించిన ఫొటోలులాగా ఉన్నాయి. తమ్ముడి పెళ్లి పనులు ఆమె దగ్గర ఉండి చూసుకుంటున్నారని తెలుస్తోంది.