Prithviraj Sukumaran Accident : ప్రముఖ మలయాళ నటుడు షూటింగ్‌లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'విలాయత్ బుద్ద' చిత్రీకరణలో సెట్లో ఓ ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో గాయపడ్డారు. గాయం తీవ్రత కారణంగా ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయానికి శస్త్రచికిత్స కూడా చేయనున్నారు. గాయం కారణంగా పృథ్విరాజ్ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయన 'విలాయత్ బుద్ద' సినిమాలో నటిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు.. జయన్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. అను మోహన్, ప్రియంవద కృష్ణన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు పృథ్విరాజ్. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల మందుకు రానుంది.
మరో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్..
'ఆదిపురుష్' సినిమాతో మంచి విజయం అందుకున్న ప్రభాస్.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కే' కూడా ఫుల్ స్పీడ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. డైరెక్టర్ మారుతితో కూడా ఓ చిత్రంలో నటిస్తున్నారు. అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌తో స్పిరిట్ తెరకెక్కుతోంది. తాజాగా ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలోని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ డైరెక్టర్‌తో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అటు నిర్మాణ సంస్థగాని.. ఇటు ప్రభాస్ అధికారికంగా స్పందించలేదు. త్వరలో ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఫుల్ స్పీడ్‌లో ఓజీ షూటింగ్.. 50 % కంప్లీట్..
పవన్ కల్యాణ్ సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఓజీ' మూవీ ప్రస్తుతం అభిమానుల్లో భారీ అంచనాలే పెంచుతోంది. శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 50 శాతం చిత్రీకరణం పూర్తి చేసుకుంది. తాజాగా హైదారాబాద్‌లో 3వ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. వచ్చే నెలలో తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టనున్నట్లు తెలిపింది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.