మలైకా అరోరా ఎప్పుడూ సోషల్‌మీడియాలో వినిపించే పేర్లలో ఈ పేరు ఒకటి. తన జీవితంలో జరిగే విషయాలను అభిమానులతో పంచుకుంటూ వారికి దగ్గరగా ఉంటుంది ఈ నటి. తాజాగా తన మాజీ భర్త అర్బజ్ ఖాన్‌తో విడాకుల గురించి చెప్పింది. మూవింగ్ ఇన్ విత్ మలైకా అనే కార్యక్రమం మొదటి ఎపిసోడ్‌లో విడాకులు తీసుకోడానికి గల కారణాన్ని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. అర్బజ్ ఖాన్‌కు మొదట ప్రపోజ్ చేసింది తానేనని నటి వెల్లడించింది.
సల్మాన్ సోదరుడిపై మలైకా కామెంట్స్.. ఆయన వల్లే ఇలా ఉన్నానంటూ.. - మూవింగ్ ఇన్ విత్ మలైకా షో మొదటి ఎపిసోడ్
ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న మలైకా అరోరా.. ఆయనపై ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయన వల్లే నేను ఇలా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.
'ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే అర్బజ్ ఖాన్‌కు ప్రపోజ్ చేసింది నేనే. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగాను. దానికి అర్బజ్ వెంటనే అంగీకరించారు. అయితే జీవితంలో భిన్నమైన అంశాలు కోరుకోవడం వల్లే మేము విడిపోయాం. ఆయన ఎంతో మంచి వ్యక్తి. నన్ను ఎంతో మార్చాడు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆయనే. ఇటీవల నేను ప్రమాదానికి గురైతే ఆపరేషన్ ధియేటర్ నుంచి బయటకు వచ్చే సరికి తను నాకోసం వేచి ఉన్నాడు. ఇప్పటికీ తను నాపై అంత ప్రేమ చూపిస్తాడు' అంటూ మాజీ భర్తపై ప్రశంసలు కురిపించింది.