MAJOR JANA GANA MANA: మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్'. అడివి శేష్ లీడ్ రోల్ పోషించారు. జూన్ 3న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. గురువారం ఈ చిత్రం నుంచి 'జనగణమన' అనే ఉద్వేగభరిత సాంగ్‌ను విడుదల చేశారు నిర్మాత, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. పాటలో వందేమాతరం అని వస్తుంటే గూస్బంప్స్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఉద్వేగంగా 'మేజర్' జనగణమన పాట.. కిర్రాక్ టైటిల్‌తో షారుక్! - అట్లీ
MAJOR JANA GANA MANA: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. అడివి శేష్ 'మేజర్', షారుక్ ఖాన్-అట్లీ దర్శకత్వంలో రాబోయే సినిమా సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.
shahrukh khan atlee movie
'జవాన్'గా షారుక్!:బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీతో చేయబోయే సినిమా పేరు 'జవాన్' అని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇందులో నయనతార హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో షారుక్ ద్విపాత్రాభినయం చేస్తారని తెలుస్తోంది. మరో నటి సాన్య మల్హోత్రా కీలక పాత్రలో నటించనుందట. ఇప్పటికే 'పఠాన్', 'డంకీ' చిత్రాలతో బిజీగా ఉన్నాడు షారుక్.
ఇదీ చూడండి:''మేజర్' గురించి షాకింగ్ విషయాలు.. సందీప్ జీవితంలో అవి కూడా..'