Dhanush Hollywood movie: కోలీవుడ్ స్టార్ కథానాయకుడు ధనుశ్ నటిస్తున్న హాలీవుడ్ సినిమా 'ది గ్రే మ్యాన్'. రస్సో బ్రదర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రియాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్, జెస్సికా హెన్విక్ తదితర హాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మే 25న విడుదల చేస్తామని మూవీటీమ్ తెలిపింది. జులై 22నుంటి మూవీ అందుబాటులో ఉండనుందని పేర్కొంది.
Mahesh Trivikram movie title: 'అతడు', 'ఖలేజా' తర్వాత త్రివిక్రమ్- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కబోయే మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేసే పనిలో మూవీటీమ్ ఉందని తెలుస్తోంది. 'అర్జునుడు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట! కాగా, త్రివిక్రమ్‌కు 'అ' అనే అక్షరం సెంటిమెంట్ ఉన్న సంగతి తెలిసిందే. 'అతడు, 'అత్తారింటికి దారేది', 'అఆ', 'అరవింద సమేత వీరరాఘవ', 'అల వైకుంఠపురములో' లాంటి సినిమాలన్నీ ఈ సెంటిమెంట్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో పాటు మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. అందుకే ఆ సెంటిమెంట్‌నే మహేశ్ చిత్రానికి కూడా కొనసాగించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. దాదాపు అర్జునుడు టైటిల్ ఖాయం చేయవచ్చని సమాచారం. మహేశ్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోను మే 31న రివీల్ చేయబోతున్నారని వినికిడి.
Nani Antey sundaraniki song release: నేచురల్ స్టార్ నాని నటించిన 'అంటే సుందరానికీ' సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను వరుసగా విడుదల చేస్తున్న ఈ మూవీటీమ్ తాజాగా 'రంగో రంగ' అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఇందులో నాని పడుతున్న కష్టాలను వివరించారు. ఇక ఈ గీతాన్ని ఎన్ సీజ కరుణ్య ఆలపించగా, సానాపాటి భరద్వాజ్ లిరిక్స్ అందించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నాని సరసన మలయాళ భామ నజ్రియా నటిస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Allarinaresh itlu maredumilli prajanikam movie: విలక్షణమైన నటుడు అల్లరి నరేష్ తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఆనంది కథానాయిక. జీ స్టూడియోస్ సమర్పణలో, హాస్య మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండు నిర్మాత. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇందులో నరేశ్ స్కూల్ టీచర్‌గా నటించనున్నట్లు తెలిసింది. ఎలక్షన్ డ్యూటీ మీద ఓ గ్రామానికి వెళ్లగా అక్కడే జరిగే పరిణామాలను ఆయన ఎలా ఎదుర్కొన్నారనేది ఈ చిత్ర కథాంశమని తెలుస్తోంది. మొత్తంగా ఈ మూవీ ఓ సీరియస్ డ్రామాగా నడుస్తుందట! కాగా, ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అబ్బూరి రవి-మాటలు, శ్రీచరణ్ పాకాల- సంగీతం, రామ్‌రెడ్డి-ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
ఇదీ చూడండి: 'మేజర్' స్ట్రాటజీ.. విడుదలకు ముందే చూసే అవకాశం