పెళ్లి తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని, మాతృత్వాన్ని పొందడం గొప్ప అనుభూతి అని తెలిపారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సతీమణి నమ్రత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్, వైవాహిక జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆ విషయంలో మహేశ్-నమ్రతకు అస్సలు పడదట - మహేశ్‌బాబు నమ్రత వివాదం
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తనకు ఏ విషయంలో గొడవ వస్తుందో చెప్పారు నమ్రత. ఆ సంగతులు..
"మహేశ్‌బాబు నేనూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా లైఫ్‌లోనే ఎంతో సంతోషకరమైన రోజది. సినిమాల్లోకి రాకముందు నేను మోడలింగ్ చేశాను. మోడలింగ్ బోర్ కొట్టడంతో సినిమా పరిశ్రమ వైపు వచ్చాను. నటిగా ప్రతి పనిని పూర్తిగా ఆస్వాదిస్తూ చేశాను. అప్పుడే మహేశ్‌ను కలిశాను. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. కాబోయే సతీమణి ఎలా ఉండాలనే విషయంలో తనకు స్పష్టమైన ఆలోచన ఉంది. అందుకే నేను సినిమాలకు దూరమయ్యా. పెళ్లి అయ్యాక కూడా నాకు అవకాశాలు వచ్చాయి. కాకపోతే నటించాలనే ఉద్దేశం నాకస్సలు లేదు. మహేశ్‌కు నాకూ మధ్య గొడవలు రావు. ఒకవేళ ఏమైనా వచ్చినా అది పిల్లల విషయంలోనే ఉంటుంది. పిల్లలు తమకు ఏం కావాలన్నా ఆయన్నే అడుగుతుంటారు. ఆయన కాదు అనరు. నేను నో చెబుతుంటాను. అలా మా మధ్య సరదాగా వాదనలు జరుగుతుంటాయి" అని నమ్రత తెలిపారు. ఇక, మహేశ్ నటించిన పోకిరి అంటే తనకెంతో ఇష్టమని.. అందులో ఆయన చెప్పే పంచ్ డైలాగ్‌లు తనకెంతో నచ్చాయని చెప్పారు.
ఇదీ చూడండి:ఈ టాలీవుడ్ అల్లరి పిల్లను గుర్తుపట్టగలరా