తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేశ్​ 'సర్కారు వారి పాట' టాక్​ ఎలా ఉందంటే? - Maheshababu Sarkaru vaari pata director

Sarkaru Vaaripata twitter review: పరశురామ్​ దర్శకత్వంలో సూపర్​స్టార్​ మహేశ్​బాబు-కీర్తిసురేశ్​ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' గురువారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా రివ్యూను చూసేద్దాం..

Sarkaru vaari pata movie review
మహేశ్​ సర్కారు వారి పాట ట్విట్టర్​ రివ్యూ

By

Published : May 12, 2022, 7:38 AM IST

Updated : May 12, 2022, 8:04 AM IST

Sarkaru Vaaripata twitter review: సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. 'గీతగోవిందం' వంటి బ్లాక్​బస్టర్ హిట్​​ తర్వాత పరశురామ్​ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. 'మహానటి' కీర్తిసురేష్​ కథానాయిక. దాదాపు 15ఏళ్ల తర్వాత మహేశ్​ సరికొత్త మేకోవర్​, డిఫరెంట్​ డైలాగ్​ డెలివరీతో ఇందులో కనిపించారు. భారీ అంచనాలతో గురువారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్​తో దూసుకెళ్తోంది. ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెరపై ప్రిన్స్​ను చూసి బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. మహేశ్​ ఇంట్రడక్షన్​ అదిరిపోయేలా ఉందని, యాక్షన్​ ఎపిసోడ్​తో సినిమా ప్రారంభమవుతుందంటున్నారు. ఫస్టాఫ్​ కామెడీ, సెకండాఫ్​ ఫైర్​గా ఉందంటున్నారు. మహేశ్​ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్​, మాస్​ ప్రేక్షకులు.. అన్ని వర్గాలా వారికి నచ్చేలా ఉందని చెబుతున్నారు. మొత్తంగా సినిమా బ్లాక్ బస్టర్​ రిపోర్టు అందుతోంది.

మహేశ్​ వన్‌ మ్యాన్‌ షో, ఆయన నటన సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిందట. దీనికి తోడు కీర్తిసురేష్‌ అందాలు.. హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ట్రాక్‌ హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. మహేష్‌ కెరీర్‌లోనే ఇది ఒక బెస్ట్ ఫిల్మ్​గా నిలిచిపోతుందంటున్నారు. దర్శకుడు పరశురామ్​ సినిమాను బాగా హ్యాండిల్​ చేశారని, తమన్​ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ కూడా సినిమాకు ప్లస్​ అని చెబుతున్నారు. సాంగ్స్​, మహేశ్​ డ్యాన్స్​కు సూపర్​ రెస్పాన్స్​ వస్తోంది. వెన్నెల కిషోర్​ కామెడీ టైమింగ్​ అన్​లిమిటెడ్​ ఫన్​ పంచుతాయని చెబుతున్నారు. మొత్తంగా మహేశ్​కు ఈ చిత్రం మాస్ ఫీస్ట్​ అని ఫ్యాన్స్​ పేర్కొంటున్నారు. అయితే కొంతమంది మాత్రం నెగెటివ్​ రివ్యూలు ఇస్తున్నారు. ఫస్టాఫ్ కామెడీ యావరేజ్ అని, సినిమా కథ సాగతీశారని అంటున్నారు.

ఇదీ చూడండి: మహేశ్​బాబు వదిలేసుకున్న సూపర్​హిట్​ సినిమాలు ఇవే..!

Last Updated : May 12, 2022, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details