తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేశ్​, అల్లు అర్జున్ సినిమాలు అప్​డేట్స్​.. రంగంలోకి అప్పుడే! - పుష్ప2

ఇటీవలే 'సర్కారు వారి పాట' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో మహేశ్ బాబు.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్​తో చేయనున్నారు. అయితే వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలిసింది. మరోవైపు, అల్లుఅర్జున్​- సుకుమార్​ కాంబోలో వచ్చిన 'పుష్ప' చిత్రం సీక్వెల్​.. 'పుష్ప 2' చిత్రీకరణ జులై నెలాఖరులో మొదలుకానుంది.

mahesh alluarjun
mahesh alluarjun

By

Published : Jun 17, 2022, 7:20 AM IST

MaheshBabu Trivikram Movie Shoot: మహేశ్​బాబు- త్రివిక్రమ్‌ కలయికలో సినిమాని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమైంది. జులై నెలలోనే చిత్రీకరణ షురూ కానున్నట్టు తెలిసింది. ఆ మేరకు పూర్వ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. సంగీత దర్శకుడు తమన్‌ ఇప్పటికే ఈ సినిమా పనులతో బిజీ అయిపోయారు. ఇటీవలే జర్మనీకి వెళ్లిన మహేశ్​బాబును దర్శకుడు త్రివిక్రమ్‌ అక్కడే కలుసుకుని చర్చలు జరిపారు.

స్క్రిప్ట్‌ పక్కా కావడం వల్ల సినిమాను ప్రారంభించాలని నిర్ణయించారు. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్​- త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మహేశ్​ ఇప్పటివరకు చేయని ఓ కొత్త రకమైన పాత్రని ఇందులో పోషిస్తున్నట్టు సమాచారం. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో మరో కథానాయికకూ చోటుందని తెలుస్తోంది.

Pushpa 2 Movie: 'పుష్ప' పార్టీ సంగతేమో కానీ.. రెండో పార్ట్‌ విషయంలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై నెలాఖరులో లేదా ఆగస్టులో చిత్రీకరణ మొదలు కానుంది. స్క్రిప్ట్‌ పనులు తుదిదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. తొలి భాగం సంచలన విజయం సాధించడంతో.. అందుకు దీటుగా భారీ హంగులతో రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కథ విస్తృతితోపాటు.. సాంకేతికంగా సినిమా స్థాయిని మరింతగా పెంచుతూ 'పుష్ప2'ని తెరకెక్కించనున్నారు. ఈసారి కథ విదేశీ నేపథ్యంలోనూ సాగనున్నట్టు తెలుస్తోంది. తొలి భాగం 'పుష్ప: ది రైజ్‌'గా రూపొందగా, రెండో భాగం 'పుష్ప: ది రూల్‌'గా తెరకెక్కనుంది.

రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కర్నూలులో లొకేషన్ల వేట కొనసాగిస్తోంది చిత్రబృందం. సినిమా విషయంలో మొదట్నుంచీ నమ్మకంగా ఉన్నారు అల్లు అర్జున్‌. ఆయన అంచనాలకి తగ్గట్టుగానే తనకీ, దర్శకుడు సుకుమార్‌కీ ఈ సినిమా జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చింది. రెండో భాగం కోసం మరింత ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. రష్మిక మందన్నతోపాటు, ఈసారి మరో కథానాయికకీ సినిమాలో చోటు లభించే అవకాశాలున్నట్టు సమాచారం.

ఇవీ చదవండి:''నిరుద్యోగుల గళమే 'గాడ్సే'.. అదే నన్ను బాలీవుడ్​కు తీసుకెళ్తుంది''

సెట్​లో రవితేజకు గాయాలు.. 10 కుట్లు.. ఆ సీన్​ షూటింగ్​లో..!

ABOUT THE AUTHOR

...view details