కొన్ని కాంబినేషన్లను చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో మహేశ్‌బాబు- రాజమౌళి ఒకటి. ఈ కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నా... రాజమౌళి 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు రూట్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితం ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించి ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను జక్కన్న మొదలుపెట్టారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఆయన మహేశ్‌ను ఉద్దేశిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేశ్ లాంటి నటుడికి కథ రాయాలని చాలా మంది రచయితలు అనుకుంటారని ప్రశంసించారు.
అందుకే మహేశ్‌ను హీరోగా రాజమౌళి ఎంచుకున్నాడు: విజయేంద్ర ప్రసాద్ - మహేశ్‌పై విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో చేయబోయే సినిమా గురించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే?
అందుకే మహేశ్‌ను హీరోగా రాజమౌళి ఎంచుకున్నాడు: విజయేంద్ర ప్రసాద్
"మహేశ్‌బాబు ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్. అతను నటించిన యాక్షన్ సన్నివేశాలు చూస్తే చాలా ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి రాజమౌళి ఇలాంటి సాహసోపేతమైన కథను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. ఈ కథకు మహేశ్ సరిగ్గా సరిపోతాడని అతనిని ఎంపిక చేసుకున్నాడు. నేను తనని దృష్టిలో పెట్టుకొని కథ రాశాను. ఈ చిత్ర షూటింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రదేశాల్లో చిత్రీకరించాలని అనుకుంటున్నాం. వచ్చే ఏడాది జూన్ నాటికి షూటింగ్ ప్రారంభించనున్నాం" అని అన్నారు.
Last Updated : Dec 5, 2022, 9:19 AM IST