టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. 2022లో రిలీజైన 'సర్కారు వారి పాట' సినిమాతో సక్సెస్‌ను అందుకున్నారు. ఆ తర్వాత ఎటువంటి ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేయని ఈ స్టార్.. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ గురించి ప్రకటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత తన 29వ సినిమాకు దర్శకుడిగా జక్కన్నను ఎంచుకున్నారు. అప్పట్లోనే వీరిద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోందన్న వార్తలు నెట్టింట్ హల్ చల్ చేశాయి. అయితే ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఆ ఆశలు ఫలించాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో తాజాగా SSMB29 సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ రూమర్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్ల కొడుతోంది.
'SSMB 29' నుంచి క్రేజీ అప్డేట్.. ఈ సినిమా కూడా 'బాహుబలి'లా! - ఎస్ఎస్ఎంబీ 29 డైరెక్టర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న'SSMB 29'కు సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అదేంటంటే..
ఇప్పటికే బాహుబలి 'ది బిగినింగ్'తో పాటు 'ది కన్ క్లూజన్' సినిమాలను తెరకెక్కించిన జక్కన్న పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన 'ఆర్ఆర్ఆర్' గురించి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క సినిమాతో ఆయన రేంజ్ పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ వరకు వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా అందరూ మన తెలుగు సినిమాల వైపు చూడటం మొదలుబెట్టారు. 'నాటు నాటు' సాంగ్‌తో పాటు సినిమాకు ఆస్కార్ లెవెల్లో గుర్తింపు రావడంతో అటు హాలీవుడ్‌తో పాటు ఇటు బాలీవుడ్‌లోనూ జక్కన్న ఖ్యాతి గురించి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాజమౌళి టీమ్.. మహేశ్ బాబు సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీ అయిపోయారట.
'బాహుబలి' లాగా ఈ సినిమాను కుడా జక్కన్న రెండు పార్టుల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంతే కాకుండా మహేశ్ ఈ ప్రాజెక్ట్ కోసం నాలుగేళ్ల పాటు వర్క్ చేయనున్నారట. నిజ జీవితంలో జరిగిన ఓ ఘటన ఈ సినిమాకు స్ఫూర్తినిచ్చిందంటూ జక్కన్న తండ్రి, రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ గతంలోనే వెల్లడించారు. సాహసాల చుట్టూ సాగే ఈ సినిమా.. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుందని తెలిపారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా అని విజయేంద్ర ప్రసాద్‌ను అడగ్గా.. దానికి ఆయన అవును అని సమాధానమిచ్చారట. సీక్వెల్లో స్టోరీలో మాత్రమే మార్పులుంటాయని.. మెయిన్ క్యారెక్టర్స్ అలానే ఉంటాయని తెలిపారట. మరోవైపు రాజమౌళి గత చిత్రాల కంటే ఈ సినిమాలో సరికొత్త భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట.