Mahesh Rajamouli Movie : ప్రస్తుతం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సూపర్‌స్టార్ మహేశ్ బాబు - రాజమౌళి కాంబో. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా..? సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా..? అంటూ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో మహేశ్ బాబు - రాజమౌళి సినిమాలో టాలీవుడ్‌కు చెందిన ప్రస్తుత టాప్ హీరో విలన్‌గా నటించబోతున్నారని కథనాలు వస్తున్నాయి.
వివరాళ్లోకి వెళితే.. ఎస్ఎస్ రాజమౌళి... ఈ పేరే ఓ బ్రాండ్. ఆయన సినిమాలో హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అనేది ప్రేక్షకులు చూడరు. థియేటర్లకు పోటెత్తుతారు. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చవి చూడని దర్శకుడాయన. 'ఆర్ఆర్ఆర్'తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్న ఆయన ఇప్పుడు మహేశ్ బాబుతో సౌతాఫ్రికా అడవుల నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఇండియన్ సినిమాలో చూడని అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అయితే ఇది ఇంకా మొదలు కాకముందు నుంచే చాలా వార్తలు వినిపిస్తున్నాయి. రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. కానీ దీనిపై మూవీటీమ్ కానీ.. మహేశ్ బాబు, రాజమౌళి కానీ ఎవరూ స్పందించడం లేదు.