తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కొత్త మూవీ కోసం మహేశ్​ మేకోవర్​, ఎన్టీఆర్​ ఫిజికల్​ ట్రైనర్​తో - trivikram new movid

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో సూపర్​స్టార్​ మహేశ్​బాబు​ చేయనున్న కొత్త సినిమా షూటింగ్ తాజాగా మొదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ మూవీకోసం మహేశ్​ తన మేకోవర్‌పై దృష్టిపెట్టారు. ఇందులో ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తారని సమాచారం. హెయిర్‌స్టైల్‌తోపాటు, ఫిజికల్‌గానూ కొత్తగా కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Etv mahesh new movie shooting
Etv mahesh new movie shooting

By

Published : Aug 17, 2022, 8:35 AM IST

Mahesh Babu Trivikram Movie: మహేశ్​ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలయికలో సినిమా ఈ నెలలోనే మొదలయ్యే అవకాశాలున్నాయి. నిర్మాతలు చిత్రీకరణల నిలిపివేతతో ఆలస్యమైంది కానీ... లేదంటే ఈపాటికే పట్టాలెక్కేదే. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్​ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయికగా నటించనున్నారు. కొన్నాళ్లుగా ఈ సినిమా కోసం చిత్రబృందం సన్నాహాలు చేసుకొంటోంది. అయితే కథానాయకుడు మహేశ్​ తన మేకోవర్‌పై దృష్టిపెట్టారు. ఇందులో ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తారని సమాచారం. హెయిర్‌స్టైల్‌తోపాటు, ఫిజికల్‌గానూ కొత్తగా కనిపించనున్నట్టు తెలుస్తోంది.

అందుకోసం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ నేతృత్వంలో కసరత్తులు షురూ చేశారు. అయితే హీరోలతో కసరత్తులు చేయించి, వారిని కొత్తగా చూపించటంలో ముందుంటారు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌. 'అరవింద సమేత', 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' కోసం ఎన్టీఆర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ దగ్గరే ట్రైన్‌ అయ్యారు. అలా 'ఎన్టీఆర్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌'గా మంచి గుర్తింపు పొందిన స్టీవెన్స్‌.. మహేశ్‌బాబు తో ఫొటో దిగటం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. మహేశ్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీని స్టీవెన్స్‌ పంచుకోవటమే ఆలస్యం.. నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో మహేశ్‌ టీ షర్టు ధరించి, టోపీ పెట్టుకుని నవ్వుతూ కనిపించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు చేస్తున్న సినిమా (#SSMB28)లో స్టీవెన్స్‌ భాగస్వామి కాబోతున్నారని, ఆయన మహేశ్‌ను చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

లాయిడ్‌ స్టీవెన్స్‌తో మహేశ్​​

అంతకుముందు, సోమ‌వారం మ‌హేశ్​ షేర్​ చేసిన న్యూ లుక్ ఫొటో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇందులో లైట్​గా గ‌డ్డం, మీసంక‌ట్టుతో స్టైలిష్‌గా మ‌హేశ్​ క‌నిపిస్తున్నారు. 'లవింగ్ ది న్యూ వైబ్' అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మహేశ్​ లుక్​ను సంగీత దర్శకుడు త‌మ‌న్, డైరెక్టర్​ తివ్రిక్రమ్​.. 'ఎస్ఎస్ఎమ్‌బీ 28' హ్యాష్​ ట్యాగ్​ ఇచ్చి ట్వీట్ చేశారు. దీంతో త్రివిక్ర‌మ్ సినిమాలో మ‌హేష్ ఈ లుక్‌లోనే క‌నిపించ‌నున్నారంటూ ఓ చిన్న క్లారిటీ ఇచ్చేశారు.

మహేశ్​​ బాబు స్టైలిష్​ లుక్​

ఇవీ చదవండి:ఉత్కంఠగా హైవే ట్రైలర్, శర్వానంద్​ మూవీ నుంచి కొత్త పాట

ఎన్టీఆర్​ దైవాంశ సంభూతుడు, ఇవే సాక్ష్యాలు

ABOUT THE AUTHOR

...view details