తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

SSMB 28 నైజాం రైట్స్​ కోసం తీవ్ర పోటీ.. దిల్​ రాజు దక్కించుకుంటారా? - ఎస్​ఎస్​ఎంబీ 28 నైజాం రైట్స్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న 'ఎస్​ఎస్​ఎంబీ 28' నైజాం రైట్స్​పై తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆ సంగతులు..

Mahesh bau SSMB 28 Dilraju Nijam rights
SSMB 28 నైజాం రైట్స్​ కోసం తీవ్ర పోటీ

By

Published : Jan 30, 2023, 2:42 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఎస్​ఎస్​ఎంబీ 28'. సితార ఎంటర్​టైన్మెంట్​ నిర్మిస్తున్న ఈ మూనీ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం తీవ్ర పోటీ నడుస్తుందని తెలుస్తోంది. కొద్ది కాలంగా భారీగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

అయితే తాజాగా అందించిన సమాచారం ప్రకారం దిల్​ రాజు ఈ రైట్స్​ కోసం రూ.50కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. అయితే మరోవైపు ఏషియన్ సునీల్​ సిండికేట్​ కూడా రూ.48కోట్లకు అడగుతున్నారని వినిపిస్తోంది. అలా ఈ నైజాం రైట్స్​ కోసం వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది. మరి ఈ హక్కులు ఎవరి చెంతకు చేరుతాయో తెలియాల్సి ఉంది.

కాగా, నైజాం, వైజాగ్ ప్రాంతాలకు చాలా కాలంగా దిల్ రాజునే టాప్​ డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతున్నారు. అగ్ర బ్యానర్లు మైత్రీ మూవీ మేకర్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సహా ఇతరులు నిర్మించిన చిత్రాలను ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్​ నాగ వంశీతో(సితార ఎంటర్​టైన్మెంట్స్​) మంచి సంబంధాలే ఉన్నాయి. ఇకపోతే మహేశ్ బాబు.. ఏషియన్ సునీల్‌తో బిజినెస్​లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్​ఎస్​ఎంబీ 28 రైట్స్ ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు దిల్​రాజు రూ.50కోట్లు వెచ్చించి ఈ రైట్స్​ కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి.

ఇక ఎస్​ఎస్​ఎంబీ 28 విషయానికొస్తే.. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. #SSMB28గా ఇది ప్రచారంలో ఉంది. పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. ఇందులో మహేశ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించనున్నారు. శ్రీలీల మరో హీరోయిన్. తమన్​​ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చూడండి:షారుక్​ 'పఠాన్'​ అస్సలు ఆగట్లేదుగా.. ఐదు రోజుల్లో రూ.550కోట్లు

ABOUT THE AUTHOR

...view details