తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

SSMB 28 క్రేజీ అప్డేట్​.. మహేశ్​ బాబు@ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్! - mahesh as software engineer role

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​, టాలీవుడ్​ స్టార్​ హీరో మహేశ్​ బాబు.. కాంబోలో తెరకెక్కుతున్న SSMB 28(వర్కింగ్​ టైటిల్) సినిమాకు సంబంధించి నెట్టింట్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మూవీలో ఐటెం సాంగ్​ ఉంటుందని, మహేశ్​ సినిమాలో ఆ లుక్​లో కనిపించనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

mahesh-babu-will play software engineer-role-in-ssmb28
mahesh-babu-will play software engineer-role-in-ssmb28

By

Published : Oct 6, 2022, 4:11 PM IST

సూపర్​స్టార్ మహేశ్​ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న SSMB 28(వర్కింగ్​ టైటిల్) సినిమా తాజాగా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో మహేశ్​.. సరికొత్త లుక్​లో కనిపించనున్నారు. చాలా ఏళ్ల తరువాత త్రివిక్రమ్-మహేశ్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్​లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఓ షూటింగ్​ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్​ను మొదలుపెట్టబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. మహేశ్​ బాబు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్​గా కనిపించనున్నారట. ఇదివరకు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓనర్​గా ఆయన ఓ సినిమాలో కనిపించారు. కానీ ఈసారి ఉద్యోగిగా కనిపించనున్నారు. నెక్స్ట్ షెడ్యూల్​లో పూర్తిగా కుటుంబ నేపథ్యంలో సాగే సన్నివేశాలను తెరకెక్కిస్తారని తెలుస్తోంది.

ఐటెం సాంగ్​ కూడా..
తొలిసారి మహేశ్​ బాబు కోసం త్రివిక్రమ్ ఐటెం సాంగ్ పెట్టబోతున్నారట. ఈ విషయంపై నిర్మాత నాగవంశీ కూడా స్పందించారు. సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకున్న మాట నిజమేనని.. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు కానీ స్పెషల్ పబ్ సాంగ్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు మహేశ్​ బాబు కోసం తన పంథా మార్చుకొని ఐటెం సాంగ్ పెడతారో లేదో చూడాలి.

#SSMB28Aarambham
ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వక ముందు, షూటింగ్ మొదలైన తరువాత.. సినిమాకి టైటిల్ ఇదేనంటూ చాలా రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. షూటింగ్ మొదలుపెట్టిన రోజు #SSMB28Aarambham అంటూ మేకర్స్ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టడంతో.. ఈ సినిమాకి టైటిల్ హింట్ ఇచ్చేశారని అందరూ భావించారు. 'ఆరంభం'అనేది సినిమా టైటిల్ అని.. అందుకే అలా ట్యాగ్ చేశారంటూ ఫ్యాన్స్​ ట్రెండ్ చేశారు. మేకర్స్ మాత్రం ఈ టైటిల్​పై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మరో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు త్రివిక్రమ్, ఇటు మహేశ్​ ఇద్దరి సెంటిమెంట్ కలగలిసేలా 'అయోధ్యలో అర్జునుడు' అని పెట్టబోతున్నారని టాక్.

ఇవీ చదవండి:

'పొన్నియన్‌ సెల్వన్‌' వివాదం.. కమల్‌ సెన్సేషనల్​ కామెంట్స్​.. ఏమన్నారంటే?

'మంత్రి కాగానే అన్నీ మర్చిపోతారా? జబర్దస్త్​ గురించి అప్పుడు చెప్పినవన్నీ అబద్ధాలేనా?'

ABOUT THE AUTHOR

...view details