SSMB 28 Title announcement : సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త సినిమా SSMB 28 కొద్ది రోజులుగా వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. త్రివిక్రమ్-మహేశ్ మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయని, షూటింగ్ వాయిదా పడిందని, ఇప్పటికే చిత్రీకరించిన సన్నివేశాలు అనుకున్నంత బాగా రాలేదని, స్క్రిప్ట్ విషయంలో మార్పులు, చర్చలు కొనసాగుతున్నాయని, అందుకే మహేశ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ఫారెన్ ట్రిప్స్‌కు వరుసగా వెళ్తున్నారని.. ఇలా రకరకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా రావట్లేదు.
మరోవైపు టైటిల్ విషయంలోనూ కొద్ది రోజులుగా రకరకాలుగా పేర్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్‌కు 'అ' అనే అక్షరం సెంటిమెంట్‌గా ఉండటం వల్ల.. 'అ' అనే అక్షరంతోనే పెడతారని అంటున్నారు. ఇందులో భాగంగానే 'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. కానీ దానిపై నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కవగా ఉండటంతో మూవీటీమ్.. మనసు మార్చుకుందని అన్నారు.
ఇప్పుడు తాజా కబురేంటంటే.. ఈ సినిమా టైటిల్ గురించి మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. 'గుంటూరు' అనే పదం ఉండేలా చూస్తున్నారట. 'గుంటూరు కారం', 'గుంటూరు మిర్చి', 'గుంటూరు అబ్బాయి'.. ఇలా ఈ మూడు టైటిళ్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఇందులో 'గుంటూరు కారం' టైటిల్‌కు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 'మిర్చి' పదం జోడిస్తే.. ప్రభాస్ సినిమా టైటిల్ తీసుకున్నట్లు ఉంటుంది. 'అబ్బాయి' అనే పదం ఉపయోగిస్తే.. సాఫ్ట్‌గా ఉంటుంది. అందుకే మాస్‌కు త్వరగా కనెక్ట్ అయ్యేలా 'గుంటూరు కారం' అనే టైటిల్ అయితే సెట్ అవుతుందని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. మహేశ్ మాస్ లుక్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆ పోస్టర్లో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న వాతావరణాన్ని బట్టి చూస్తే.. మిర్చి యార్డ్‌లో జరిగే ఓ యాక్షన్ సన్నివేశం కూడా ఉంటుందని అర్థమవుతోంది. అలాగే ఈ పోస్టర్.. 'గుంటూరు కారం' టైటిల్‌కు దగ్గరగా ఉంటుంది.
ఏదేమైనప్పటికీ ఏ టైటిల్ ఇంకా పక్కాగా ఖరారు అవ్వలేదు కానీ వీలైనంత త్వరగానే టైటిల్‌ను ఖరారు చేసి అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మే 31న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తంగా సరికొత్త ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: పీఎస్ వినోద్.
ఇదీ చూడండి:రామ్-బోయపాటి మూవీ.. ఫస్ట్ థండర్ బ్లాస్ట్.. యాక్షన్ వేరే లెవెల్!