తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Mahesh Babu Star Name : స్పేస్​కు చేరిన మహేశ్ క్రేజ్​.. ఆ నక్షత్రానికి.. - మహేశ్​బాబు స్పేస్​ క్రేజ్​

Mahesh Babu Star Name : నటుడు మహేశ్​ బాబు అరుదైన ఘనత సాధించారు. పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు.. ఒక నక్షత్రానికి మహేశ్​ పేరును రిజిస్టర్‌ చేయించారు.

mahesh babu star name
mahesh babu star name

By

Published : Aug 9, 2023, 2:38 PM IST

Updated : Aug 9, 2023, 3:01 PM IST

Mahesh Babu Star Name : టాలీవుడ్ సూపర్​ స్టార్​, బర్త్​డే బాయ్​ మహేశ్​ బాబు.. అరుదైన ఘనత సాధించారు. మహేశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు.. మహేశ్​కు ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్​ ఇచ్చారు. ఒక నక్షత్రానికి ఆయన పేరును రిజిస్టర్‌ చేయించారు. ఈ విషయాన్ని స్టార్‌ రిజిస్ట్రేషన్‌ సంస్థ అధికారికంగా తెలిపింది. ఈ మేరకు RA:12H33M29S నక్షత్రానికి మహేశ్ బాబు పేరు పెట్టారు. గెలాక్సీలో అత్యంత ప్రేమగా ఇష్టపడే నక్షత్రం ఇదేనంటూ వారు పేర్కొన్నారు.

వెకేషన్​లో మహేశ్​..
Mahesh Babu Vacation :ఇకపోతే.. మహేశ్​బాబు ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి స్కాట్‌లాండ్‌ టూర్‌కు వెళ్లారు. బుధవారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని సినీ ప్రముఖులు విషెస్‌ తెలుపుతున్నారు. మహేశ్‌ ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలంటూ చిరంజీవి, ఎన్టీఆర్‌, హరీశ్‌ శంకర్‌, తమన్‌, విజయ్‌ దేవరకొండ.. తదితరులు పోస్టులు పెట్టారు.

Mahesh Babu Guntur Kaaram Movie : ఇక, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన.. తివిక్రమ్​ దర్శకత్వంలో గుంటూరు కారంలో నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు(బుధవారం) మహేశ్​ పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్​డే విషస్​ చెబుతూ మేకర్స్​ పోస్టర్​ రిలీజ్​ చేశారు. ఇందులో మహేశ్‌ లుంగీ కట్టుకుని, బీడీ కాలుస్తూ మాస్‌ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ సినిమా రిలీజ్​పై వస్తున్న వార్తలపై కూడా చిత్ర బృందం మరోసారి స్పష్టతనిచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. సంగీత దర్శకుడు తమన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకొంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటికి కూడా పోస్టర్‌తో సమాధానం ఇచ్చింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఆయనే కొనసాగనున్నారు.

Mahesh Babu Guntur Kaaram Cast :ఇదంతా బాగానే ఉన్నా.. మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా కేవలం పోస్టర్‌ మాత్రమే విడుదల చేయడం పట్ల అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. సినిమా నుంచి ఏదైనా లిరికల్‌సాంగ్‌, లేదా గ్లింప్స్‌లాంటిది ఇచ్చి ఉంటే వారి ఆనందం మరో రేంజ్‌లో ఉండేది. కనీసం డైలాగ్‌ టీజర్‌నైనా విడుదల చేస్తే బాగుండేదని సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. గుంటూరు కారంలో మహేశ్‌ జోడీగా శ్రీలీల నటిస్తుండగా మరో కథానాయికగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Mahesh Babu Interesting Facts : తెలియకుండానే సినిమాల్లోకి వచ్చి.. సూపర్​ స్టార్​గా ఎదిగి.. ఒక్క రీమేక్​ కూడా చేయకుండా..

Mahesh Babu Birthday : ప్రతిరోజు నువ్వే నువ్వే అంటున్న నమత్ర.. 'సూర్య భాయ్​​' సందడే సందడి!

Last Updated : Aug 9, 2023, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details