SSSMB 28 Update: సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇదే విషయంపై మూవీ టీమ్ సైతం ఒక క్లారిటీ ఇచ్చింది. జనవరిలో 'ఎస్ఎస్ఎంబీ28' రెండో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
మహేశ్ బాబు 'SSMB28' లేటెస్ట్ అప్డేట్.. త్వరలోనే.. - మహేశ్ బాబు త్రివిక్రమ్ సినిమా
త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్టేట్ వచ్చేసింది. అదేంటంటే?
మహేశ్ బాబు
ఇక మూవీ టీమ్‌తో కలిసి మహేశ్ బాబు క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.