తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఘాటుగా SSMB 28 మాస్​​ స్ట్రైక్​ టైటిల్​.. మహేశ్ యాక్షన్​ అదిరింది! - ssmb Mass stike video release

SSMB 28 Title and First Glimpse : సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #SSMB 28 టైటిల్, ఫస్ట్ గ్లింప్స్​ వచ్చేశాయి. ఆ వివరాలు..

Mahesh Babu SSMB  28
Mahesh Babu SSMB 28 title announcement

By

Published : May 31, 2023, 6:24 PM IST

Updated : May 31, 2023, 6:48 PM IST

SSMB 28 Title : సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో #SSMB 28 చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్​పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ క్రమంలోనే మే 31 సూపర్​స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా సినిమా టైటిల్​, ఫస్ట్​ గ్లింప్స్​ను(SSMB 28 Glimpse) రిలీజ్ చేస్తామని ఊరిస్తూ 'మాస్‌ స్ట్రైక్‌' పేరుతో వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తోంది మూవీటీమ్​.

భారీ ఎత్తున అభిమానులు.. అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రోజు వచ్చేసింది. చెప్పినట్టుగానే 'మాస్ట్​ స్ట్రైక్'​ పేరుతో SSMB 28 టైటిల్​, ఫస్ట్​ గ్లింప్స్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. సూపర్​స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్​ అయిన థియేటర్లలో వీటిని ప్రదర్శించింది. భారీ అభిమానుల కేరింతలు, ఈలలు మధ్య వారి చేతే రిలీజ్​ చేయించింది. ముందుగా నుంచి ప్రచారంలో ఉన్న 'గుంటూరు కారం' టైటిల్​ను ఖారరు చేసింది. చాలా కాలం తర్వాత మహేశ్​ ఇలాంటి మాస్​ టైటిల్​తో రాబోతున్నారు.

మొత్తంగా నిమిషం నాలుగు సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఆద్యంతం మహేశ్ మాస్ ఫైట్లతో ఆకట్టుకుంటోంది. సినిమాలో మహేశ్​ మేనరిజం, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూపించడానికి ఈ టీజర్​ను రిలీజ్ చేశారు. మహేశ్ స్టైలిష్ లుక్​, అందులోనూ బీడి కాలుస్తూ నడవడం, 'బీడీ 3డీలో కనపడుతుందా' అంటూ అనడం అంతా ఆకట్టుకుంది. ఈ ఫైటింగ్ సీన్​లో భాగంగా బాంబు పేలి జీపు గాల్లో లేచే ఓ సన్నివేశం పెట్టారు. స్టోరీకి సంబంధించి ఎలాంటి హింట్స్​ లేదా ఇతర పాత్రల పరిచయాలు ఏమీ చెయ్యలేదు. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్​, సన్నకర్ర అనే చిన్న బిట్ సాంగ్.. మహేశ్​ను ఎలివేషన్ చేయడానికి బాగా ఉపయోగపడింది. బాగుంది కూడా. ఓవరాల్​గా ఈ విజువల్ వీడియో ట్యాగ్ లైన్​కు తగ్గట్టుగా ఉంది.

కాగా, 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. ఇందులో మహేశ్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. శ్రీలీల మరో హీరోయిన్​గా నటిస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న వరల్డ్​ వైడ్​గా రిలీజ్​ కానుంది. ఎస్‌.రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి :

దుబాయ్​లో మహేశ్​ కాస్ట్లీ విల్లా.. ట్రిప్​ వేసింది అందుకేనట!

సూపర్​ స్టార్​ కృష్ణను ఈ డిఫరెంట్​ గెటప్స్​లో చూశారా

Last Updated : May 31, 2023, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details