Mahesh Babu Shahrukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, సూపర్ స్టార్ మహేశ్ బాబు మధ్య ఎక్స్ లో జరిగిన సరదా సంభాషణ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రాన్ని తన కుటుంబంతో కలిసి చూడాలనుకుంటున్నట్లు మహేశ్ బాబు ఎక్స్ లో ట్వీట్ చేశారు. జవాన్ విజవయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మహేశ్ బాబు ట్వీట్ పై స్పందించిన షారూక్ ఖాన్.... థాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్ అంటూ రిట్వీట్ చేశారు. జవాన్ తప్పకుండా మహేశ్ కు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మహేశ్ ఎప్పుడు జవాన్ చూడాలనుకుంటున్నారో చెబితే అప్పుడే తాను కూడా మహేశ్ తో కలిసి సినిమాకు వస్తానని షారుక్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. మహేశ్ కుటుంబానికి అభినందనలు తెలిపారు. కాగా జవాన్ రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇకపోతే షారుక్ - మహేశ్ బాబు మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి చాలా మంది సినీ ప్రియులకు తెలిసిన విషయమే. గతంలో 'బ్రహ్మోత్సవం' షూటింగ్ సమయంలోనూ షారుక్ సెట్స్‌కు వెళ్లి మహేశ్‌ను కలిశారు. వీరిద్దరు కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.