Sarkaru Vaari Paata Title Song: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ విడుదలైంది. శుక్రవారం చిత్రబృందం చెప్పినట్టుగానే ఈ పాట మోత మోగిస్తోంది. వరుస హిట్లతో దూసుకెళ్తున్న మహేశ్.. దర్శకుడు పరశురాంతో కలిసి తీస్తున్న సినిమా ఇది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్‌బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.
సర్కారు వారి 'టైటిల్' పాట వచ్చేసింది.. మోత మోగిపోయింది - సర్కారు వారి పాట
Sarkaru Vaari Paata Title Song: సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో మహేశ్ లుక్స్, తమన్ సంగీతం ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
sarkaru vaari paata title song
మే 12న ఈ చిత్రం విడుదలకానుంది. ఇదివరకే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. కళావతి పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరో పాట 'పెన్నీ'లో మహేశ్ ముద్దుల కుమార్తె సితార సందడి చేసి సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.
ఇదీ చూడండి:'ఆచార్య 'లాహేలాహే ప్రోమో..'సర్కారు వారి పాట' సూపర్ అప్డేట్