తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సర్కారు వారి 'ట్రైలర్'' వచ్చేసింది.. మహేశ్​కు మరో మాస్ హిట్!! - సర్కారు వారి పాట పాటలు

Sarkaru Vaari Paata Trailer Released: సూపర్​స్టార్ మహేశ్​బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్స్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోమవారం ఈ సినిమా థియేట్రికల్​ ట్రైలర్​ను మేకర్స్​ రిలీజ్​ చేశారు.

MAHESH SVP TRAILER
MAHESH SVP TRAILER

By

Published : May 2, 2022, 4:12 PM IST

Sarkaru Vaari Paata Trailer Released: సూపర్ స్టార్ మహేశ్​ బాబు హీరోగా, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్​టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల అయిన ఈ సినిమా ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

ఆదివారం చిత్రబృందం చెప్పినట్టుగానే ట్రైలర్​ను 105 షాట్స్​తో మేకర్స్​ రిలీజ్ చేశారు. బ్యాంకింగ్ స్కామ్‌ల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కిన‌ట్లు ట్రైలర్​ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్​ బాణీలు సమకూరుస్తున్నారు. హీరోయిన్​గా నటించిన కీర్తి సురేశ్​ కూడా తాజాగా డబ్బింగ్‌ పూర్తి చేసింది. దర్శకుడు పరుశురాం, మ్యూజిక్ డైరెక్టర్ తమన్​ దగ్గరుండి కీర్తి సురేశ్​తో డైలాగ్స్ చెప్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసిన కీర్తి.. 'సర్కారు వారి పాట' సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

ABOUT THE AUTHOR

...view details