Mahesh Babu Sandeep Reddy Vanga Movie :బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ - సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ కాంబోలో రానున్న చిత్రం యానిమల్. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్గా నటించింది. ట్రైలర్‌తో అంచనాలు మరింత పెంచిన ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ మీట్లో నిర్మాత దిల్‌రాజు, సందీప్ రెడ్డి, నటుడు అనిల్ కపూర్, హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్నా తదితరులు పాల్గొన్నారు.
అయితే డైరెక్టర్ సందీప్ వంగ ఈ కథ ముందుగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వినిపించారని.. కానీ, ఆయన రిజెక్ట్ చేశారన్న వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. దీని గురించి మీడియా అడగ్గా.. సందీప్ వంగ ఈ ప్రెస్మీట్లో క్లారిటీ ఇచ్చారు. " నేను మహేశ్‌కు చెప్పింది 'డెవిల్' స్టోరీ. దాంట్లో హీరో క్యారెక్టరైజేషన్ దాదాపు 'యానిమల్' లాగే ఉంటుంది.కానీ, అది వేరు. ఈ స్టోరీ కాదు. దాంట్లో వైలెన్స్ ఇంతకన్నా ఎక్కువగా ఉంటుంది. అందరూ అనుకున్నట్టు సినిమాను మహేశ్ రిజెక్ట్ చేయలేరు. జస్ట్ ఆ సినిమా కుదరలేదు అంతే" అని బదులిచ్చారు.
Animal Movie Advance Bookings : యానిమల్ ప్రీ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. దేశ రాజధాని దిల్లీలో ఇప్పటిరే ఓపెనింగ్ డే బుకింగ్స్ రూ. 2 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా బుకింగ్స్‌లో రూ.10 కోట్ల మార్క్ క్రాస్ అయ్యిందట. అందులో ప్రముఖ మల్టీఫ్లెక్స్‌లు పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్‌లో 2779 షో లకుగాను రూ. 5 కోట్లు బిజినెస్ అయ్యిందని టాక్. కాగా, ఈ సినిమా డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.