Mahesh Babu New Year Wishes : సూపర్‌స్టార్ మహేశ్ బాబు నూతన సంవత్సర వేడుకలను కుటుంబంతో కలిసి దుబాయ్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా నమ్రతతో కలిసి దిగిన స్పెషల్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభిమానులకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ, 'స్పాంటేనిటీ, నవ్వు, ప్రేమ, సాహసం, గ్రోత్ #హ్యాపీ న్యూ ఇయర్ #2024 ❤️' అని క్యాప్షన్ ఇచ్చారు.
మరోవైపు నమ్రత, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. అందులో మహేశ్ బాబు గారాల పట్టి సితార, కుమారుడు గౌతమ్ చాలా క్యూట్‌గా ఫొటోలకు ఫోజులిచ్చారు.
సినిమాలు, బ్రాండ్ల ప్రమోషన్లతో మహేశ్ బాబు ఎప్పుడూ బిజీగా ఉంటారు. వాటి నుంచి ఏమాత్రం సమయం దొరికినా ఏదో వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులతో సరదాగా షికారులు చేస్తుంటారు. ప్రస్తుతం మహేశ్ తన ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్‌లో ఉన్నారు. అక్కడే న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నారు. అయితే అటు వర్క్‌లైఫ్, ఇటు ఫ్యామిలీని చక్కగా బ్యాలెన్స్ చేస్తారు మహేశ్, నమ్రత. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది ఆరాధించే జంటలలో ఈ స్టార్ జంట ముందుంటుంది.