Mahesh Babu Guntur Karam : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మరో తొమ్మిది రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. త్వరలోనే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారట. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎక్కడ నిర్వహించబోతున్నారు? అని అందరిలో ఆసక్తిగా ఉంది.
ముఖ్యంగా విజయవాడ, గుంటూరు అభిమానులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక అప్డేట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, ఈ చిత్రానికి గుంటూరు కారం అనే టైటిల్ పెట్టడంతో ఆ ప్రాంతంలో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తారేమో అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది. జనవరి 6వ తేదీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందట. ఆ రోజే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారట.
ఇది పక్కన పెడితే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మహేశ్ బాబు మరో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేయబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికా థియేటర్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నారట. కాలిఫోర్నియాలోని సినీ లాంజ్ ఫ్రీమాంట్ 7 సినిమాస్ స్క్రీన్‌పై ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ కానుందట. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినీ వేడుకలు వెండితెరపై కనిపించనుండడం కూడా చిత్ర పరిశ్రమలో ఇదే తొలిసారి. దీంతో మహేశ్ బాబు మరో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసి ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటున్నారు.