తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గుంటూరు కారం' రూ.100 కోట్లు - మహేశ్ ఖాతాలోకి ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డ్​! - గుంటూరు కారం 100కోట్లు కలెక్షన్స్

Mahesh Babu Guntur kaaram 100 Crores Collections : సూపర్ స్టార్​ మహేశ్‌ బాబు కలెక్షన్స్ విషయంలో ఓ రేర్ ఫీట్​ను నమోదు చేశారు.

'గుంటూరు కారం' రూ.100 కోట్ల షేర్​​ - మహేశ్ ఖాతాలోకి ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డ్​!
'గుంటూరు కారం' రూ.100 కోట్ల షేర్​​ - మహేశ్ ఖాతాలోకి ఏ హీరోకు సాధ్యం కానీ రికార్డ్​!

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 3:59 PM IST

Mahesh Babu Guntur kaaram 100 Crores Collections : సూపర్ స్టార్​ మహేశ్‌ బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. ఈ సినిమా మొదటి రోజు తొలి షో నుంచే డివైడ్​ టాక్‌ అందుకున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో దూసుకెళ్తోంది. రిజల్ట్​ విషయాన్ని పక్కన పెడితే మహేశ్​ మేనరిజానికి అభిమానులు, ఫ్యామిలీ ఆడియెన్స్​ మరోసారి ఫిదా అయిపోతారు. థియేటర్లలో డ్యాన్స్​లు వేస్తూ కేకలతో హోరెత్తిస్తున్నారు.

అయితే ఇప్పుడీ సినిమా డివైడ్​ టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో ఓ రేర్​ ఫీట్‌ను నమోదు చేసింది. రూ.100 కోట్ల షేర్​ను అందుకుంది. 'భరత్‌ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' చిత్రాల తర్వాత ఈ రికార్డును సాధించిన చిత్రంగా గుంటూరు కారం నిలిచింది. దీంతో బ్యాక్‌ టు బ్యాక్ ఐదు సినిమాలకు రూ.100 కోట్ల షేర్ అందుకున్న వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా రికార్డుకెక్కారు మహేశ్. దీంతో సోషల్​ మీడియా అంతా ఇదే విషయం ఫుల్ ట్రెండింగ్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా రూ.200కోట్ల గ్రాస్​కు(guntur karam world wide collections) చేరువలో ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Guntur Kaaram OTT Rights : కాగా, ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ను జెమినీ టీవీ దక్కించుకున్నట్లు తెలిసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది. స్క్రీన్‌పై ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షకులు మరోసారి ఫిదా అవుతున్నారు. శ్రీలీలతో పాటు మున్నపెన్నడూ లేని విధంగా మహేశ్ డ్యాన్స్(Guntur Kaaram Mahesh Dance) వేయడం చూసి ప్రేక్షకులు సర్​ప్రైజ్ అవుతున్నారు. ఇంకా ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక గ్లామర్, టాలెంట్ ఉన్నా కూడా మీనాక్షి చౌదరికి సరైన పాత్ర ఇవ్వలేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వీళ్లు సౌత్​ ఇండియన్ ఫిల్మ్​ సూపర్ హీరోస్​!

ఇదే నాకు చివరి తెలుగు సినిమా - అందుకే అలా చేశా : మహేశ్ బాబు

ABOUT THE AUTHOR

...view details