Mahesh Babu Birthday : టాలీవుడ్ సూపర్ స్టార్ హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు పుట్టినరోజు నేడు(ఆగస్ట్ 9). ఈ సందర్భంగా మహేశ్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఆయన ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆయన సినిమాకు సంబంధించిన పోస్టర్లను, ఫొటోస్ను ట్రెండ్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే బయట కూడా కేక్‌లు కట్ చేసి రచ్చ రంబోలా చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పూలదండలు, పాలాభిషేకాలతో అభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Mahesh Babu Birthday Wishes : సాధారణంగా సెలబ్రిటీలు తమ పుట్టినరోజు అంటే.. పార్టీలు చేసుకుంటారు. మరీ ముఖ్యంగా సరదాగా పబ్‌లు అంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. లేదంటే ఫ్యామిలీతో కలిసి ఇష్టమైన ఫుడ్స్ తింటూ సరదాగా గడుపుతుంటారు. అయితే మహేశ్ బాబు తన పుట్టినరోజున ఓ పని మాత్రం అస్సలు చేయరట. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి బర్త్‌డే రోజు నాన్ వెజ్ తినరట. అస్సలు ముట్టుకోరట. కనీసం ఎగ్ కూడా తినరట. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ మహేశ్ అంత స్ట్రిక్ట్‌గా ఉంటారని బయట పలు కథనాలు ఉన్నాయి. కారణం ఏంటో తెలీదు కానీ మహేశ్ బాబు తన పుట్టినరోజుకు మాంసాహారాలు తినకూడదని గట్టిగా కండిషన్ పెట్టుకున్నారని ఆ కథనాల్లో ఉంది. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ వార్త బయటకు కాస్త ఎక్కువగా చక్కర్లు కొడుతోంది.