తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Mahesh babu birthday celebrations : మహేశ్ బర్త్​డే సెలబ్రేషన్స్​.. ఈ సారి అక్కడే చేసుకోనున్నారట! - Trivikram mahesh babu Gunturu karam movie

Mahesh babu birthday celebrations : సూపర్ స్టార్ మహేశ్​ బాబు ఈ సారి కూడా తన పుట్టినరోజు వేడుకల్ని అక్కడే జరుపుకోబోతున్నట్లు తెలిసింది. ఆ తర్వాత గుంటూరు కారం షూటింగ్ సెట్​లో అడుగుపెడతారట. ఆ వివరాలు..

mahesh babu birthday celebrations
ఫారెన్ లో మహేశ్ బాబు బర్త్​డే సెలబ్రేషన్స్​

By

Published : Aug 6, 2023, 5:25 PM IST

Mahesh babu birthday celebrations : మరో మూడు రోజుల్లో సూపర్ స్టార్ మహేశ్​ బాబు అభిమానులు సంబరాలు చేసుకునే రోజు వచ్చేస్తోంది. అదే ఆగస్ట్​ 9 ఆయన పుట్టినరోజు. ఆ రోజు మహేశ్​ 48వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే మహేశ్​​ గత కొన్నేళ్లుగా తన పుట్టిన రోజు వేడుకలను విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సారి కూడా విదేశాల్లోనే జరుపుకోబోతున్నారని తెలిసింది. ట

ఇటీవలే ఓ రెండు వారాల క్రితం తన కుటుంబంతో కలిసి మహేశ్​ ఫారెన్ టూర్ లండన్​కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేశ్​ లండన్​ నుంచి స్కాట్లాండ్​కు వెళ్లారట. స్కాట్లాండ్​లోని గ్లెన్​ఈగల్స్​ అనే గోల్ఫ్​ రిసోర్ట్​లో ఉన్నట్లు తెలిసింది. అక్కడే తన ఫ్యామీలితో కలిసి బర్త్​డే సెలబ్రేషన్స్​ను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారట.

ఈ బర్త్​డే వేడుక అయిపోగానే మరో వారం రోజుల పాటు అక్కడే ఉండి.. 16వ తేదీన ఆయన తిరిగి వస్తారని తెలుస్తోంది. వచ్చాక త్రివిక్రమ్​ గుంటూరు కారం షూటింగ్​లో పాల్గొంటారట. 20వ తేదీ నుంచి సెట్​లో అడుగుపెడతారట.

Trivikram mahesh babu Gunturu karam movie : అయితే గుంటూరు కారం సినిమా చిత్రీకరణ మొదటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే సినిమాటోగ్రాఫర్​ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్త సినిమాటోగ్రాఫర్​ను వీలైనంత త్వరగా ఫైనలైజ్​ చేసి 11 లేదా 12 నుంచి చిత్రీకరణ మొదలు పెట్టాలని చూస్తున్నారట. హీరో కాకుండా ఇతర నటీనటులపై షూట్​ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

Mahesh rajamouli movie SSMB 29 : ఇంకా మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్​కు మంచి సర్​ప్రైజ్ కూడా ఇవ్వాలని మూవీటీమ్ ప్లాన్ చేస్తోందని తెలిసింది. సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేసేలా సన్నాహాలు ​ చేస్తున్నారని ఇన్​సైడ్​ టాక్ వినిపిస్తోంది. దీంతో దర్శకధీరుడు రాజమౌళి-మహేశ్ కాంబోలో రాబోయే సినిమా గురించి కూడా అఫీషియల్​ అనౌన్స్ మెంట్ వస్తుందని అంతా ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి :

Rajamouli Mahesh babu movie : ఆ రోజు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న రాజమౌళి!

Gunturu Karam Shooting : మహేశ్​ తిరిగొచ్చేస్తున్నాడహో.. ఆ రోజు నుంచే షూటింగ్ షురూ..

ABOUT THE AUTHOR

...view details