సూపర్ స్టార్ కృష్ణ.. సినీరంగంలో ఆయన పేరు చేరగని ముద్ర. తన నటనతో ప్రేక్షక హృదయాల్లో గొప్ప స్థాయిని సంపాదించుకున్నారు. సాహసాలకు, సంచనాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిలోనే పాత్రలతో ప్రయోగాలు చేశారు. అప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేసి జేమ్స్‌బాండ్ తరహాలో గుఢాచారి 116 సినిమాతో అద్భుతం చేశారు. ఇక తొలి తెలుగు కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాతో రికార్డులు క్రియేట్ చేశారు.
ఓ హీరోగానే కాదు వ్యక్తిగతంగా మంచి మనుసున్న నటుడాయన. కష్టకాలంలో నిర్మాతలను ఆదుకున్న గొప్ప హీరో. అందుకే ఆయనను నిర్మాతల హీరో అన్నారు. స్టార్ హీరోగా, మంచి వ్యక్తిగా సూపర్ స్టార్ సువర్ణాక్షరాలతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి ఆయన గురించి ప్రముఖ రచయిత, మహాకవి శ్రీశ్రీ గతంలో ఏమన్నారో తెలుసా? అప్పట్లోనే తనదైన రాతలతో కృష్ణ గొప్పతనాన్ని శ్రీశ్రీ చాటిచెప్పారు. ఓ సందర్భంలో కృష్ణ గురించి ప్రస్తావించిన ఓ పాత న్యూస్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.