తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Mahadev Betting App Case Ranbir Kapoor : బాలీవుడ్ హీరో రణ్​బీర్​ కపూర్​కు ఈడీ సమన్లు.. ఆ కేసులోనేనట..

Mahadev Betting App Case Ranbir Kapoor : బాలీవుడ్‌ స్టార్​ హీరో రణ్‌బీర్‌ కపూర్‌కు ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. అక్టోబరు 6న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

Mahadev Betting App Case Ranbir Kapoor
Mahadev Betting App Case Ranbir Kapoor

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 3:59 PM IST

Updated : Oct 4, 2023, 4:49 PM IST

Mahadev Betting App Case Ranbir Kapoor :ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ కేసులో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ED సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 6న విచారణకు హాజరు కావాలని పేర్కొంది.
కాగా.. బెట్టింగ్‌ యాప్‌ మాటున జరుగుతున్న భారీ కుంభకోణాన్ని ఇటీవల ఈడీ బయటపెట్టింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్‌ చంద్రఖర్‌, రవి ఉప్పల్‌ యూఏఈలోని దుబాయ్‌ కేంద్రంగా దేశంలో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే, వీరు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో మనీలాండరింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ బెట్టింగ్‌ యాప్‌ పెద్ద ఎత్తున యాడ్స్​ కోసం ఖర్చు చేసినట్లూ ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఇటీవల కోల్‌కతా, భోపాల్‌, ముంబయి వంటి తదితర నగరాల్లో సోదాలు నిర్వహించి.. మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను సీజ్‌ చేసింది.

కాగా.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వినిపించాయి. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకుల్లో ఒకరి పెళ్లికి వీరు హాజరవ్వడమే అందుకు కారణం. ఈ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రఖర్‌ వివాహం 2023 ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, సన్నీ లియోనీ, నేహా కక్కర్‌, అతిఫ్‌ అస్లమ్‌, రహత్‌ ఫతేహ్‌ అలీ ఖాన్‌, అలీ అస్గర్‌, విశాల్‌ దద్లానీ తదితరులు హాజరయ్యారు. వీరి కోసం ఓ ప్రైవేటు జెట్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆ వేడుకకు హాజరైన సినీతారలపై ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రణ్‌బీర్‌ కపూర్‌కు తాజాగా సమన్లు జారీ చేసింది. కాగా.. మరో 17 మంది బాలీవుడ్‌ సెలబ్రిటీలపై ఈడీ నిఘా పెట్టినట్లు సమాచారం. త్వరలోనే వారికి కూడా సమన్లు జారీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Oct 4, 2023, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details