స్టార్ హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ స్విమ్మింగ్‌లో రాణిస్తున్నాడు. మరోసారి దేశం గర్వపడేలా చేశాడు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటి.. సిల్వర్ మెడల్‌ను సాధించాడు. ఇదే ఈవెంట్‌లో మరో విభాగంలో సాజన్ ప్రకాశ్ గోల్డ్ గెలుచుకున్నాడు. దీంతో ఈ ఇద్దరు ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ విభాగంలో భారత్‌కు ఆశాకిరణంగా మారారు.
కొడుకు సిల్వర్ మెడల్ గెలవడంపై మాధవన్ ఉబ్బితబ్బిబైపోతున్నారు. పుత్రోత్సాహంలో మునిగితేలుతున్నారు. ఈ ఘనత సాధించడానికి తోడ్పాటు అందించిన స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఇన్‌స్టా వేదికగా ధన్యవాదాలు తెలిపారు మాధవన్. తన కొడుకు పతకం అందుకుంటున్న వీడియోను ఈ సందర్భంగా షేర్ చేశారు.
"కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్‌లో వేదాంత్ భారత్‌కు రజితాన్ని అందించాడు. ప్రదీప్ సార్, స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు. మేం చాలా గర్వపడుతున్నాం."
- మాధవన్, నటుడు
మాధనవ్ ఇన్స్టాల్లో పోస్ట్‌ను షేర్ చేసిన కొద్ది క్షణాలకే వైరల్‌గా మారింది. క్రీడాభిమానులు, సెలబ్రిటీలు, మాధవన్ అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. నటి శిల్పా శెట్టి, ఆమె సోదరి షమితా శెట్టి.. ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
మాధవన్ కుమారుడి ఘనత.. డానిష్ ఓపెన్ స్విమ్మింగ్‌లో సిల్వర్ - madhavan son medal
స్టార్ హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ ప్రపంచ వేదికపై సత్తా చాటాడు. కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్‌ను సాధించాడు. దీంతో మాధవన్ పుత్రోత్సాహంలో ముగినిపోయారు. అలాగే ఇదే ఈవెంట్‌లో మరో విభాగంలో సాజన్ ప్రకాశ్ గోల్డ్ గెలుచుకున్నాడు.
మాధవన్ కుమారుడు వేదాంత్
అయితే మాధనవ్ కుమారుడు వేదాంత్ స్విమ్మింగ్‌లో పోటీల్లో పతకాలు సాధించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది బెంగళూరులో జరిగిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు సాధించాడు. అంతకుముందు జరిగిన లాట్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ ఈవెంట్‌లో వేదాంత్ కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా వేదాంత్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.
ఇదీ చదవండి:ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు: ఆలియా
Last Updated : Apr 16, 2022, 10:38 PM IST