'ఐ యామ్ రెడీ.. నన్ను ఎట్టాగా పిలిచినా రెడీ.. వచ్చి నా సోకులిస్తా వడ్డీ.. మల్లెపువ్వులాంటి ఒళ్లు సెంటు బుడ్డి' అంటూ ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టింది నటి అంజలి. నితిన్ కథానాయకుడిగా ఎమ్.ఎస్.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం. కృతిశెట్టి, కేథరిన్ కథానాయికలు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో 'రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ' అంటూ సాగే ప్రత్యేక గీతం లిరికల్ సాంగ్‌ను శనివారం విడుదల చేశారు. ఆ పాటలో అంజలి ఆడిపాడారు. మహతి స్వర సాగర్ అందించిన స్వరాలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. అంతే జోష్‌తో లిప్సికా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
'రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ'.. నితిన్- అంజలి మాస్ బీట్ అదుర్స్ - macherla niyojakavargam music director
నితిన్ కథానాయకుడిగా ఎమ్.ఎస్.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. అయితే ఈ సినిమాలోని 'రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ' అంటూ సాగే ప్రత్యేక గీతం లిరికల్ సాంగ్‌ను శనివారం విడుదల చేశారు. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చిన ఈ మాస్ బీట్ ఆకట్టుకుంటోంది.
''రాజకీయ అంశాలతో కూడిన పక్కా వాణిజ్య చిత్రమిది. నితిన్ యువ ఐఏఎస్ అధికారిగా సందడి చేయనున్నారు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమాకి అంజలి ప్రత్యేక గీతం ప్రధాన ఆకర్షణ. హైదరాబాద్ లో వేసిన ఓ భారీ సెట్‌లో ఆ పాటని తెరకెక్కించామని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల, మాటలు: మామిడాల తిరుపతి, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.
ఇదీ చదవండి:'నాకు ఆ ఆలోచన ఉంటే.. అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యేవి'