తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Maa Oori Polimera 2 Movie : ఈ సారి ఎనిమిది ట్విస్టులతో.. అస్సలు ఊహించని విధంగా.. - satyam rajesh new movie

Maa Oori Polimera 2 Movie : సత్యం రాజేశ్‌, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'మా ఊరి పొలిమేర' సినిమాలో ట్విస్ట్‌లను బాగా ఎంజాయ్‌ చేశారు ఆడియెన్స్​. దీంతో ఇప్పుడు సీక్వెల్​లోనూ అలానే ట్విస్ట్​లు పెట్టారు. మొత్తం 8 ట్విస్ట్​లను ఉంచారు. ఆ సంగతులు..

Maa Oori Polimera 2 Movie : ఈ సారి ఎనిమిది ట్విస్టులతో.. ప్రేక్షకులు ఊహించని విధంగా..
Maa Oori Polimera 2 Movie : ఈ సారి ఎనిమిది ట్విస్టులతో.. ప్రేక్షకులు ఊహించని విధంగా..

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 9:33 AM IST

Maa Oori Polimera 2 Movie : 'మా ఊరి పొలిమేర'.. కరోనా టైమ్​లో ఏమాత్రం అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజై విశేష ఆదరణ అందుకుంది. సత్యం రాజేశ్​, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్​కు ప్రేక్షకుల ​ వెన్నులో వణుకు పుట్టించింది. అయితే చేతబడి కాన్సెప్ట్​తో వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. మరో మూడు రోజుల్లో ఈ సారి థియేటర్లో రానుంది. విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పటికే ప్రమోషన్స్​లో జోరు పెంచింది మూవీటీమ్​. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర దర్శకుడు అనిల్ విశ్వనాథ్​.. 'పొలిమేర 1'తో పోల్చితే 'పొలిమేర 2'తో దాదాపు పది రెట్లు ఎక్కువ థ్రిల్‌ను అనుభూతి చెందుతారని అన్నారు.

"అసలు ఈ చిత్రం రెండు భాగాల కథ కాదు. మొదట ఒక కథగానే రాసుకున్నాను. కానీ ఫస్ట్ పార్ట్​ గంటన్నార నిడివితోనే ఉంటుంది. ఎందుకంటే అక్కడికే మంచి హై వచ్చిన ఫీలింగ్‌ కలిగింది. అందుకే రన్ టైమ్​ తక్కువ ఉన్నా.. ఎలాగో ఓటీటీ మూవీనే కాబట్టి అక్కడితే ముగించాం. దానికి మంచి రెస్పాన్స్​ వస్తే మిగతా కథను సెకండ్ పార్ట్​గా రిలీజ్ చేయాలని అప్పుడు నిర్ణయించుకున్నాం. అనుకున్నట్టే తొలి భాగానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మిగిలి ఉన్న మరో అరగంట కథను కాస్త పెంచి సీక్వెల్​గా సిద్ధం చేశాను.

తొలి భాగంలో ట్విస్ట్‌లను బాగా ఎంజాయ్‌ చేశారు ఆడియెన్స్​. దీంతో రెండో భాగంలో ప్రేక్షకులు ఊహించలేని ఎనిమిది ట్విస్ట్‌లను పెట్టాను. అవి అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. క్లైమాక్స్​ ఎంతో షాకింగ్‌గా ఉంటాయి. పార్ట్​ 3 కూడా(Maa Oori Polimera 3) ఉంటుందని అనౌన్స్​ చేశాను. దీనికి సంబంధించి కథ కూడా రెడీగా ఉంది." అని అన్నారు.

కాగా, ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్​పై గౌరికృష్ణ ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. మూఢ నమ్మకాల నేపథ్యంగా గ్రామీణ ప్రాంతంలో జరిగే కథతో రూపొందించారు. ఇంకా సినిమాలో డాక్టర్ కామాక్షి, రాకేందు మౌళి, అక్షత, రవివర్మ, చిత్రం శ్రీను కూడా నటించారు.

This week movie Releases : ఈ వారం థియేటర్​/ఓటీటీలో 13 సినిమాలు.. నవ్విస్తూనే భయపెట్టేలా!

Dethadi Harika Latest Photos : చీరలో దేత్తడి అందాల గుబాళింపు.. ఈమె నాజూకు నడుము చూశారంటే ఫుల్ బాటిల్ కిక్​!

ABOUT THE AUTHOR

...view details