Lokesh Kanagaraj Leo movie : చిత్రపరిశ్రమలో ఏ ట్రెండ్ అయినా ఎక్కువ కాలం రిపీట్ అయితే చూస్తే ప్రేక్షకుడికి బోర్ కొట్టేస్తది. అందుకే హీరోలు, దర్శకనిర్మాతలు.. ఎప్పుడు కొత్తదనాన్ని పంచేందుకు ప్రయత్నిస్తుంటారు. అవి సక్సెస్ అయితే కొద్ది కాలం పాటు వాటినే రిపీట్ చేస్తారు. అయితే ఇప్పుడు చిత్రసీమలో హీరోలు, వారి క్యారెక్టరైజేషన్ ఎలివేషన్ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ఓ హీరోకు లేదా స్పెషల్ సీన్‌కు ఇచ్చే ఎలివేషన్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. ఈ ఎలినేషన్ సీన్స్ బాగా చూపించే దర్శకుల్లో ప్రశాంత్ నీల్, లోకేశ్ కనగరాజ్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే లోకేశ్ కనగరాజ్ విషయానికొస్తే.. 'ఖైదీ'తో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న ఆయన.. 'విక్రమ్'తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ఆయన ఇప్పుడు దళపతి విజయ్‌తో కలిసి 'లియో' సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఆ మధ్య సంజయ్ దత్‌కు సంబంధించి ఇంట్రో వీడియో ఒకటి విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు తాజాగా(Leo Movie Arjun Sarja) యాక్షన్ కింగ్ అర్జున్ను సంబంధించిన హరోల్డ్ దాస్ గ్లింప్స్ విడుదలై ఆకట్టుకుంది. అయితే ఇవి కూడా విక్రమ్ సినిమాను గుర్తుచేస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా హరోల్డ్ దాస్ గ్లింప్స్.. విక్రమ్ మూవీలోని రోలెక్స్ క్యారెక్టర్ తరహాల ఉందని, క్యారెక్టరైజేషన్ అలానే కనిపిస్తుందని చెబుతున్నారు.