vijay devarkonda bold look: విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. అనన్య పాండే కథానాయిక. మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీటీమ్ ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. విజయ్‌కు సంబంధించి ఓ షాకింగ్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో విజయ్.. కండలు తిరిగిన దేహంతో బోల్డ్ లుక్‌లో రోజాపూలు పట్టుకుని నిలబడి ఉన్నాడు. "రక్తం, చెమట, మనసు, ప్రాణం... అన్నింటినీ తీసుకొస్తున్నాం.. ఎప్పటికీ గుర్తుండిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో విజయ్ దేవరకొండను మీ ముందుకు తీసుకొస్తున్నాం" అని క్యాప్షన్ జోడించింది. ఈ పోస్టర్ విజయ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోగా.. మిగతావారు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. 'సెక్సియస్ట్ పోస్టర్', 'బోల్డ్ క్యారెక్టర్ చేసే నటులు అరుదుగా ఉంటారు. అప్పట్లో ఆమిర్‌ఖాన్, రణ్‌బీర్‌కపూర్ ఇలాంటి పాత్రలను చేశా'రంటూ గుర్తుచేసుకుంటున్నారు.
'లైగర్' షాకింగ్ పోస్టర్.. బోల్డ్ లుక్‌లో విజయ్‌దేవరకొండ - vijay devarkonda nude poster
VijayDevarkonda Sexiest poster: లైగర్ మూవీటీమ్ ఫ్యాన్స్‌కు ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. విజయ్‌దేవరకొండకు సంబంధించిన ఓ షాకింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. నెట్టింట్లో ఈ పోస్టర్ తెగ ట్రెండ్ అవుతోంది.
విజయ్‌దేవరకొండ బోల్డ్ లుక్
కాగా, ఈ సినిమాలో విజయ్ మిక్స్డ్‌మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆ విద్యలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. కఠిన కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ లుక్‌లోకి మారారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి కేచ- స్టంట్స్, జునైద్ సిద్ధిఖీ-కూర్పు, విష్ణు శర్మ-ఛాయాగ్రహణం అందించారు.
ఇదీ చూడండి: నరేశ్-పవిత్ర బంధం.. మధ్యలో ట్విస్ట్.. అసలేం జరుగుతోంది?
Last Updated : Jul 2, 2022, 11:58 AM IST