Liger In OTT : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ 'లైగర్'. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే, ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న నెటిజన్లకు డిస్నీ+హాట్‌స్టార్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సెప్టెంబరు 22(గురువారం) నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'లైగర్' ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రోజులుగా సోషల్‌మీడియాలో ఈ విషయమై ట్రెండ్ అవుతున్నా, అధికారికంగా ప్రకటించడం కానీ, ప్రమోషన్స్ కానీ, లేవు. చిన్న ట్వీట్‌తో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చి, కాస్త ఆశ్చర్యపరిచింది. అనన్యపాండే కథానాయికగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు.
కర్నూలులో 'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్..:నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సోనాల్ చౌహాన్ కథానాయిక. ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 25న కర్నూల్‌లోని ఎస్టీబీసీ మైదానంలో విడుదల ముందస్తు వేడుక నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకకు చిత్ర బృందమంతా హాజరు కానున్నట్లు ప్రకటనలో తెలిపారు.
గోదావరి నేపథ్యంలో రానున్న 'బెదురులంక 2012'.. :కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ఎల్బీ శ్రీరామ్, అజయ్ ఘోష్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి 'బెదురులంక 2012' అనే టైటిల్ ఖరారు చేశారు. బుధవారం కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. "ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది.