తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

లైగర్​ ఫలితంతో పునరాలోచనలో పూరీ- విజయ్​.. ఈ సారి పక్కా స్కెచ్​తో.. - లైగర్​

'లైగర్​' ఫలితాలతో పూరీ, విజయ్​ ఆలోచనలో పడ్డారు. మళ్లీ వీరిద్దరి కాంబోలో రానున్న 'జనగణమన'పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని, పక్కా ప్ర​ణాళికతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

puri jagannadh
liger failure has affected vijay deverakonda and puri jagannadh jana gana mana

By

Published : Sep 1, 2022, 6:51 PM IST

Liger Movie : విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం 'లైగర్‌'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని చవి చూసింది. దీంతో పూరీ జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరోసారి వీరిద్దరూ చర్చల్లో కూర్చోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ చర్చలు దేని గురించి అంటే..?

పూరీ జగన్నాథ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా సిద్ధం కానున్న చిత్రం 'జనగణమన'. మహేశ్‌తో ఈ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు కొన్నేళ్ల క్రితం పూరీ ప్రకటించారు. స్క్రిప్ట్‌, ఇతర కారణాల వల్ల మహేశ్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో ఇది నిలిచిపోయింది. దీంతో ఇదే ప్రాజెక్ట్‌ని విజయ్‌తో చేయనున్నట్లు ఇటీవల పూరీ ప్రకటించారు. గత నెలలో పట్టాలెక్కిన ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ సైతం పూర్తైంది. 'లైగర్‌' బ్లాక్‌బస్టర్‌ అవుతుందని, కాబట్టి తమ కాంబోలో రానున్న 'జనగణమన'ను భారీగా తీర్చిదిద్దాలని వీరు ఆశించారు.

'లైగర్‌' విడుదల అనంతరం అనుకున్న ఫలితాలు రాకపోవడంతో 'జనగణమన' విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విజయ్‌ దేవరకొండ - పూరీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్‌ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, అన్ని సక్రమంగా ప్లాన్‌ చేసుకోవాలని వీరిద్దరూ భావిస్తున్నారట. అనవసరంగా సినిమాపై ఖర్చులు పెట్టకూడదని.. బడ్జెట్‌ని కాస్త నియంత్రించుకునేలా ప్రణాళికలు రచించేందుకు మరోసారి కలిసి కూర్చొని చర్చించుకోనున్నారని పలు బాలీవుడ్‌ పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నాయి.

ఇవీ చదవండి:అందుకే రహస్యంగా పెళ్లి చేసుకున్నా: కత్రినా కైఫ్​

వైరల్​గా ప్రభాస్​-కృతిసనన్​ ఆడియో కాల్​​, అసలేం మాట్లాడుకున్నారంటే..

ABOUT THE AUTHOR

...view details