తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

లైగర్‌ సినిమాకు సెన్సార్ కట్స్, ఏడు అభ్యంతరాలు, వాటిని తొలగించాలంటూ - లైగర్ సెన్సార్ రిపోర్ట్

పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల సినిమా లైగర్​కు సెన్సార్ కట్స్ ఎదురయ్యాయి. ఎఫ్‌తో మొదలయ్యే అమర్యాదకరమైన పదాన్ని వాడిన సీన్లను మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. మొత్తంగా ఏడు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చివరకు యూ,ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. మరోవైపు, ఈ సినిమాకు ట్విట్టర్ ఎమోజీ లభించింది.

LIGER CENSOR CUTS
LIGER CENSOR CUTS

By

Published : Aug 18, 2022, 7:38 PM IST

Liger censor certificate : విజయ్‌ దేవరకొండ హీరోగా సిద్ధమైన పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ 'లైగర్‌'కు సెన్సార్‌ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మొత్తం 140.20 నిమిషాల రన్‌ టైమ్‌తో సెన్సార్‌కు వెళ్లిన ఈ సినిమాకి బోర్డు ఏడు మార్పులు చేర్పులు సూచించింది. ఎఫ్‌తో మొదలయ్యే అమర్యాదకరమైన పదాన్ని సినిమాలో చాలాచోట్ల నటీనటులు ఉపయోగించారని.. కాబట్టి అలాంటి పదాలను మ్యూట్‌ చేయమని కోరింది.

Liger censor report : కొన్ని సీన్స్‌లో ఎదుటివారిపై కోపాన్ని తెలియజేస్తూ నటీనటులు చేసే సైగలు కూడా అసభ్యకరంగా ఉన్నాయని వాటిని బ్లర్‌ చేయమని సెన్సార్ బోర్డు తెలిపింది. అలాగే, చేతులతో సంజ్ఞ చేసే మరో సన్నివేశం అభ్యంతరకరంగా ఉందని, దాన్ని తొలగించమని చెప్పింది. కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన 'లైగర్‌' ఆగస్టు 25న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనన్యా పాండే కథానాయిక.

'లైగర్‌'కు ట్విట్టర్‌ ఎమోజీ
మరోవైపు 'లైగర్‌'కు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ ప్రత్యేక ఎమోజీని ఇచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడులవుతుండటంతో సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లకు మరింత చేరువ అయ్యే క్రమంలో చిత్ర బృందం ట్విటర్‌కు దరఖాస్తు చేయగా, #Liger హ్యాష్‌టాగ్‌ జత చేయగానే విజయ్‌ దేవరకొండ ఫొటోతో కూడిన ఎమోజీ వస్తుంది. ట్విట్టర్‌ ఎమోజీని పొందిన మూడో సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఇప్పటివరకూ తెలుగులో ప్రభాస్‌ 'సాహో', మహేశ్‌బాబు 'సర్కారువారిపాట' చిత్రాలకు మాత్రమే ట్విట్టర్‌ ఎమోజీలు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details