తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వీల్​చైర్​లో దిగ్గజ బాక్సర్​ మైక్​టైసన్​, ఏమైంది - లైగర్​ బాక్సర్​ మైక్​ టైసన్​

లైగర్​ సినిమాలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ బాక్సర్ మైక్​టైసన్​ వీల్​చైర్​లో కదలలేని పరిస్థితిలో ఉన్న ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయనకు ఏం అయిందంటే.

Mike Tyson wheel chair
వీల్​చైర్​లో మైక్​ టైసన్​

By

Published : Aug 18, 2022, 12:27 PM IST

Updated : Aug 18, 2022, 1:32 PM IST

విజయ్​దేవరకొండ లైగర్​ సినిమాలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ బాక్సర్ మైక్​టైసన్​ గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. తాజాగా ఆయన వీల్​చైర్లో కూర్చొని కదలలేని పరిస్థితిలో ఉన్న ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. దీంతో ఈ ఫొటోలు చూసిన అభిమానులు లెజెండరీ బాక్సర్‌కు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. లైగర్‌ షూటింగ్‌లో హుషారుగా కనిపించిన యోధుడు కర్ర పట్టుకు కూర్చొని, ఇతరుల సాయంతో ముందుకు కదులుతున్న దృశ్యాలను చూసి అభిమానులు కంగారు పడుతున్నారు.

వీల్​చైర్​లో మైక్​ టైసన్​

ఈ నేపథ్యంలోనే టైసన్​ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. టైసన్‌ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికా అనే నరాల జబ్బుతో బాధపడుతున్నట్లు తెలిసింది. డాక్టర్లు టైసన్‌ను వీల్‌ చైర్‌ వాడాలని సూచించారట. విషయం తెలుసుకున్న అభిమానులు.. టైసన్​ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు టైసన్​.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎక్స్‌పైరీ డేట్‌కు దగ్గర పడుతున్నానని చెప్పిన మాటల గురించి చర్చించుకుంటున్నారు. కాగా, విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'లైగర్' ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్​గా నటించింది. రమ్యకృష్ణ, మైక్​టైసన్​ కీలక పాత్ర పోషించారు.

ఇదీ చూడండి:బాలయ్య అనిల్​రావిపూడి సినిమా బడ్జెట్​ అన్ని కోట్లా

Last Updated : Aug 18, 2022, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details