Life Is Beautiful Movie Actors :శేఖర్ కమ్ముల.. టాలీవుడ్లో సెన్సిబుల్ దర్శకుడిగా టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కాఫీ లాంటి చిత్రాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన సినిమాల్లో పెద్దగా హడావుడి ఉండదు. భారీ యాక్షన్ సీన్లు, అదిరిపోయే ఎలివేషన్లు అస్సలు ఉండవు. చాలా సింపుల్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథనంతోనే సాగిపోతుంటాయి.
Life Is Beautiful Movie Cast :2021లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అందమైన సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్, సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. మన ఇంట్లో, మన కాలనీలో జరిగే కథలో అనుబంధాల విలువలు చెబుతూ.. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ఓ అద్భుతం!.. అయితే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. అభిజిత్, సుధాకర్ పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయినా.. మిగిలిన వారు క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందులో కొందరు ప్రస్తుతం హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు.
Life Is Beautiful Movie Actors List : వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించే. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో విజయ్ను చాలా మంది గుర్తుపట్టి ఉండరు. గోల్డ్ ఫేస్‌లో ఉండే కుర్రాడిగా నటించారు విజయ్. అలాగే అదే గోల్డ్ ఫేస్ కుర్రాడిగా విజయ్ ఫ్రెండ్‌గా నటించారు నవీన్ పోలిశెట్టి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నవీన్ పోలిశెట్టి కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరోగా సత్తా చాటుతున్నారు నవీన్. హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్నారు.
శ్రీముఖిని పెళ్లి చేసుకున్నది ఆ స్టార్ హీరోనే..
ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా ఉన్నారు. ఇక ఎవ్వరు ఊహించనిది ఈ సినిమా మరో టాలెంటెడ్ హీరో కూడా ఉన్నారు. ఆయనే శ్రీ విష్ణు. హీరో అభిజిత్ ఫ్యామిలీ మెంబర్లా నటించారు శ్రీ విష్ణు. అలాగే ఈ సినిమాలో గోల్డ్ ఫేస్ అమ్మాయిగా నటించిన యాంకర్ శ్రీముఖిని ప్రేమించి పెళ్లి చేసుకునేది శ్రీవిష్ణునే. రీసెంట్గా సామజవరగమన సినిమాతో హిట్ అందుకున్నారు శ్రీవిష్ణు. చాందినీ చౌదరి కూడా ఈ సినిమాలో కనిపిస్తారు. సీనియర్ నటి అమల, అంజలి జవేరి, శ్రియ.. ఇలా ఈ సినిమాలో చాలా మంది హీరో హీరోయిన్స్ ఉన్నారు. శేఖర్ కమ్ముల సినిమాలో కనిపించి కనిపించకుండా నటించిన వీరంతా ఇప్పుడు మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు!