తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

LGM movie dhoni : ప్రభాస్​- ధోనీ- బన్నీ సినిమా.. ఆ ఊహే ఎంత బాగుందో? - ధోనీ భార్య సాక్షి ఫేవరెట్ హీరో అల్లుఅర్జున్​

LGM movie dhoni : పాన్​ ఇండియా స్టార్స్​ ప్రభాస్​- అల్లుఅర్జున్​తో.. స్టార్​ క్రికెటర్​ ధోనీ సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే బాగుంది కదూ.. దాని గురించి మహీ భార్య సాక్షి మాట్లాడింది. ఆ వివరాలు..

Dhoni
ప్రభాస్​- ధోనీ-బన్నీ సినిమా.

By

Published : Jul 25, 2023, 7:14 AM IST

Updated : Jul 25, 2023, 7:36 AM IST

LGM movie dhoni : క్రికెట్​ రంగంలో ధోనీ, సినిమా రంగంలో ప్రభాస్​, అల్లుఅర్జున్​కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ ముగ్గురికి దేశవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. అదే ఈ ముగ్గురు కలిసి సినిమాలు చేస్తే.. ఆ ఊహే బాగుంది కాదూ.. అంతా అనుకున్నట్టు జరిగితే ఇది భవిష్యత్​లో జరిగే అవకాశముందంటూ మహీ భార్య సాక్షి చెప్పింది! తాజాగా 'ఎల్‌జీఎం'(Lets Get Married) చిత్రంతో ధోనీ.. సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన సతీమణి సాక్షి.. ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటోంది. ఈ చిత్రంలో హరీశ్‌ కల్యాణ్‌, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ అండ్​ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఈ సినిమా జులై 28న రిలీజ్​ కానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ వేదికగా ఓ ప్రెస్‌మీట్‌లో సాక్షి ధోనీ పాల్గొన్నారు. పర్సనల్​ అండ్ ప్రొఫెషనల్​ లైఫ్​ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్​-ప్రభాస్​తో సినిమా గురించి మాట్లాడారు.

"అల్లు అర్జున్​, ప్రభాస్​ స్టార్‌ హీరోలు. ప్రస్తుతం వారు భారీ బడ్జెట్‌ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి మేం నిర్మాణ రంగంలో తొలి అడుగులు వేస్తున్నాము. భవిష్యత్తులో అవకాశం వస్తే ఆ ఇద్దరితో తప్పకుండా సినిమాలు చేస్తాను" అని సాక్షి ధోనీ అన్నారు. అలాగే తెలుగులో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు వీరాభిమాని అని చెప్పారు. బన్నీ నటించిన అన్ని సినిమాలు యూట్యూబ్​లో చూసినట్లు చెప్పుకొచ్చారు. అలానే 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' కూడా చూసినట్లు వెల్లడించారు. ఇంకా పలు విషయాల గురించి చెప్పారు.

LGM movie cast : ఇక ఎల్‌జీఎం సినిమా విషయానికొస్తే.. రమేష్‌ తమిళమణి చిత్రాన్ని తెరకెక్కించారు. సాక్షి ధోనీ, వికాస్‌ హస్జా కలిసి నిర్మించారు. నదియా, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్వతంత్ర భావాలున్న ఓ అమ్మాయి కథ ఇది. మన జీవితంలోని బంధాలు, బంధుత్వాల గురించి తెలియజెప్పే చిత్రంలా సినిమా సాగనుందని మూవీటీమ్ తెలిపింది. అత్తాకోడళ్ల మధ్య జరిగే సరికొత్త కథాంశంతో సినిమా రూపుదిద్దుకుంది.

Last Updated : Jul 25, 2023, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details