బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు.. చంపేస్తామని లేఖ - సలీమ్ ఖాన్‌కు బెదిరింపులు
Letter threatening to kill Bollywood actor Salman Khan Salman Khan's father had gone for a jog in the morning, where he was sitting on a bench, when he found a letter threatening him and his son Salman Khan. Bandra police have registered a case against an unknown person and started further investigation.
19:35 June 05
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు రావడం బీటౌన్‌లో కలకలం రేపింది. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనకు లేఖ రాశారు. ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్... స్థానికంగా ఉన్న ఓ పార్కులో ఉదయం జాకింగ్‌కు వెళ్లి అక్కడే ఓ బెంచీ మీద విశ్రాంతి తీసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పక్కన ఈ లేఖ వదిలి వెళ్లినట్లు తెలిపారు.
మీకు కూడా అదే గతి: దివంగత పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే తండ్రీకొడుకులకు కూడా పడుతుందని.. ఇద్దరినీ హత్య చేస్తామని దుండగులు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.