Leo Story Line : దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 19న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర లీక్ బయటకు వచ్చింది. ఈ సినిమా ప్లాట్‌లైన్ తెలిసింది. 2005లో రిలీజైన హాలీవుడ్ ఫిల్మ్ ఏ హౌస్ ఆఫ్ వైలెన్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ఇప్పటికే టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ చిత్ర ఫ్లాట్ లైన్ ఏంటంటే.. చరిత్రలోనే అత్యంత క్రూరమైన హింసా సామ్రాజ్యంలో గడిపిన ఓ వ్యక్తి.. కొన్ని అనుకోని కారణాల వల్ల దాని నుంచి విముక్తి పొంది బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత కెఫేను నడుపుకొంటూ ఫ్యామిలీతో సంతోషంగా జీవిస్తున్న అతడి లైఫ్లో కొందరు ప్రతినాయకులు ప్రవేశిస్తారు. మరి వాళ్ల రాకతో అతడి జీవితం మళ్లీ ఎలాంటి మలుపులు తిరిగింది? ఇంతకీ ఆ లియోదాస్ గతంలో ఏం చేసేవాడు? అసలు ఆ విలన్లు ఎందుకు అతడి జీవితంలోకి వచ్చారు? మరి ఆ హింసా సామ్రాజ్యం నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? మళ్లీ కత్తిపట్టాడా? లేదా? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమా సెన్సార్ను పూర్తి చేసుకుంది. లియోకు పలు కట్స్ పడ్డాయి. నాలుగు నిమిషాల నిడివి తగ్గింది.