తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Leo Ramcharan : 'లియో'లో రామ్​ చరణ్​.. అసలు నిజం ఇదే!.. మెగాఫ్యాన్స్​ గుస్సా - Leo movie telugu release

Leo Ramcharan : దళపతి విజయ్​ 'లియో' చిత్రంపై మెగా ఫ్యాన్స్, రామ్​చరణ్​ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాస్త కోపంగా కూడా ఉన్నారు.

Leo Ramcharan : 'లియో'లో రామ్​ చరణ్​.. అసలు నిజం ఇదే!.
Leo Ramcharan : 'లియో'లో రామ్​ చరణ్​.. అసలు నిజం ఇదే!.

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 10:12 AM IST

Updated : Oct 18, 2023, 10:39 AM IST

Leo Ramcharan : దళపతి విజయ్​ నటించి 'లియో' చిత్రంలో మెగా పవర్​ స్టార్​ రామ్ చరణ్ ఉన్నారంటూ ప్రచారం చిన్నగా మొదలై ఇప్పుడు భారీ స్థాయికి చేరుకుంది. రోలెక్స్ తరహాలో కోబ్రా అనే పాత్రలో చరణ్​ కనిపిస్తారని పోస్టర్లు కూడా వచ్చాయి. దీంతో అంతా నిజమేనని మెంటల్​గా ఫిక్స్ అయిపోయారు. అయితే లియో చిత్రం గురువారం (అక్టోబర్​ 19) విడుదల కానుంది. ఇలాంటి సమయంలో చరణ్ ఉన్నారంటూ వచ్చిన ప్రచారం ఇప్పుడు నిజం కాదని తెలిసింది! దీంతో మెగా ఫ్యాన్స్​ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి 'లియో' చిత్ర బృందం.. గత కొద్ది రోజులుగా ప్రమోషన్ పనుల్లో ఫుల్​ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్​ వరుస ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. కానీ ఆయన ఇంతకాలం ఈ ప్రచారాన్ని అడిషనల్ ప్రమోషన్ కింద భావించారో ఏమో కానీ.. సైలెన్స్​ మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చారు. చరణ్ ఉన్నారా లేదా అనే విషయాన్ని ఇన్ని రోజుల పాటు స్పష్టత ఇవ్వకుండా ఉన్నారు. అనవసరంగా మాట్లాడి ఓపెన్ అవ్వడం ఎందుకని ఇతర మూవీటీమ్​ కూడా భావించినట్టుంది! అస్సలు ఎవరూ నోరు విప్పలేదు.

ఇప్పుడేమో సినిమాకు ఒక్కరోజు ముందు దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీంతో రామ్​ చరణ్ అభిమానులు బాగా నిరాశ చెందుతున్నారు. అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో పేరును వినియోగించుకుని ఫ్రీ పబ్లిసిటీ పొందారంటూ విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇంతకాలం ఈ విషయంపై మేకర్స్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు.

Leo Movie Mega Fans fire :ఒకరంగా మెగా ఫ్యాన్స్ బాధలోనూ అర్థం ఉందనే అనుకోవాలి. ఎందుకంటే లియో మేకర్స్ కూడా ఇంత కాలం దాచి ఉంచి.. ఇప్పుడు ఓపెన్ అయ్యారు. తెలుగులో ఈ చిత్రానికి లోకేశ్​-విజయ్ ఇమేజ్​తో మంచి హైప్ ఉన్నప్పటికీ.. చరణ్ పేరు రావడం వల్ల ఆ హైప్ ఊహించని దానికన్నా పెరిగింది. అందుకే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్​ అసహనంగా కనిపిస్తున్నారు.

Highest Paid Actor In India : ఒకప్పుడు రూ.500... ఇప్పుడు రూ.200 కోట్ల రెమ్మునరేషన్.. ఆ స్టార్ హీరో ఎవరంటే?

Leo Telugu Movie Release Date : 'అనుకున్న రోజునే లియో రీలీజ్​ అవుతుంది.. వారితో మాట్లాడి ప్లాన్​ చేశాం'

Last Updated : Oct 18, 2023, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details