Leo OTT Release Date : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి- దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'లియో'. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద రూ. 550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక థియేటర్లో అలరించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓటీటీ విడుదల తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో 'లియో' సినిమా స్ట్రీమింగ్ కానుంది. అన్నన్ వరార్ వళీ విడు( అన్న వస్తున్నాడు దారి ఇవ్వండి) అంటూ ఈ సినిమాకు సంబంధించి రెండు రిలీజ్ డేట్స్ నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. భారత్‌లో నవంబర్ 24న స్ట్రీమింగ్ కానుండగా... గ్లోబల్ వైడగా మాత్రం నవంబర్ 28న రిలీజ్ అవుతున్నట్లు తెలిపింది. 'లియో' ఓటీటీ హక్కులను దాదాపు 120 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
Leo Movie Cast : స్టార్ డైరక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కథానాయికగా త్రిష, కీలక పాత్రల్లో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ తదితరులు నటించారు. మ్యూజిక్ డైరక్టర్‌గా అనిరుధ్ సంగీతం అందించారు . ఈ సినిమాను 7 స్క్రీన్స్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లతిత్ కుమార్ నిర్మించారు.