Leo Movie Trailer : దళపతి విజయ్ - లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'లియో'. కశ్మీర్ నేపథ్యంలో సాగే భిన్నమైన కథాంశంతో మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోంది. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా లియో ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రచార చిత్రంలో లియోదాస్‌గా విజయ్ యాక్టింగ్, ఆయనపై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఈలలు వేయించే రేంజ్లో ఉన్నాయి. అర్జున్ - విజయ్‌లపై షూట్ చేసిన సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయంది.
Leo Movie Trailer : ఊహించని రేంజ్లో పవర్‌ఫుల్‌గా 'లియో' ట్రైలర్.. విజయ్ వైల్డ్ యాక్టింగ్ గూస్‌బంప్సే - Leo Movie october 19 release date
Leo Movie Trailer : దళపతి విజయ్ - లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'లియో'. తాజాగా ఈ మూవీ నుంచి పవర్ఫుల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
Published : Oct 5, 2023, 6:50 PM IST
|Updated : Oct 5, 2023, 10:51 PM IST
"సీరియల్ కిల్లర్ నడిరోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు.. ఆల్రెడీ రోడ్డు మీద చాలా మంది చనిపోయారు. వాడు చాలా క్రూరుడు.. వాడు అందరిని కాలుస్తున్నాడు.. అప్పుడు దైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ సింహంలా వచ్చి ఆ సీరియల్ కిల్లర్‌ను కాల్చాడు. ఇప్పుడు ఆ ఆఫీసర్ కాల్చిన గన్.. నీ చేతిలో ఉంది.." అని విజయ్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభం అవ్వగా.. విజువల్స్‌ను యాక్షన్‌గా అద్భుతంగా చూపించారు.
ఆ తర్వాత కిల్లర్‌ను చంపింది పార్దీ(విజయ్) అనుకోని అతడిని విలన్స్ చంపడానికి ప్రయత్నిస్తూ ఉండటం, అయితే కిల్లర్‌ను చంపింది తాను కాదని, తనలా ఉన్న మరోడని పార్దీ చెప్పడం సస్పెన్స్‌గా చూపించారు. అయినా విలన్లు మాత్రం పార్దీని, అతడి కుటుంబాన్ని వెంబడిస్తూనే ఉండగా.. చేసేదేమిలేక పార్దీ ఎదురుతిరుగడం, ఆ తర్వాత కిల్లర్‌ను చంపింది లియో(మరో విజుయ్) అని తెలవడం జరుగుతుంది. అసలు ఈ లియో ఎవరు.. ? ఎందుకు సీరియల్ కిల్లర్‌ను చంపాడు.. లియో, పార్దీ ఇద్దరు ఒకేలా ఎందుకు ఉన్నారు? అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. అంటే విజయ్ డబుల్ రోల్లో కనిపించనున్నట్లు హింట్ ఇచ్చారు. మరి నిజంగానే.. లియో, పార్దీ వేరా? లేదా ఇద్దరు ఒకరేనా.. ? అనేది చూడాలి. కాగా, ఈ సినిమా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.